India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అంట్ మెటీరియల్స్(ARCI) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 28-30 ఏళ్లు మించకూడదు. రూ.57,960- రూ.69,120 జీతం ఉంటుంది. AUG 26లోపు https://www.arci.res.in/careers/లో అప్లై చేసుకోండి. SHARE IT
ORR లోపలున్న పట్టణాలు, నగరాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ORRకి అటూ ఇటూ ఉన్న పట్టణాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాహ్యవలయ రహదారికి వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు. ఆయ గ్రామాలను ఎలా విలీనం చేయాలనే దానిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
సైబర్ క్రైమ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం, OTP షేర్ చేయడం, అనుమానాస్పద లింకులను తెరవడం, బెదిరింపు కాల్స్‌కు స్పందించడం ఆపండి. ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చగలదు. అది సురక్షితమో కాదో నిర్ధారించుకోండి. సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోతే వెంటనే 1930కి డయల్ చేయండి’ అంటూ రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT
HYD నగరం NACP లక్ష్యాలను సాధించడంలో సగటు పనితీరు కనబరిచిందని తెలిపింది. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి నగరం యావరేజ్ పర్ఫార్మెన్స్ సిటీస్ జాబితాలో చేరింది. HYD నగరంలో పార్టీక్యులేట్ మ్యాటర్ (ధూళికణాలు ) 2.5 ఉద్గారాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించింది. దేశంలో 100 స్కోర్ సాధించిన నగరాలు 4 ఉండగా..75 స్కోర్ సాధించిన నగరాల్లో 26 ఉన్నాయి.75 స్కోర్ సాధించిన లిస్టులో హైదరాబాద్ సైతం ఉంది.
HYD కూకట్పల్లి JNTUH ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా యూనివర్సిటీలతో ఇప్పటికే MOU ఒప్పందాలు జరిగాయి. MOUలతో ఇంటిగ్రేటెడ్ బీటెక్ MS డిగ్రీ ఐదేళ్లకే పూర్తి చేసుకోవచ్చు. మూడేళ్లు JNTU, ఒక ఏడాది బీటెక్, మరో ఏడాది ఎమ్మెస్ అమెరికాలో చదివితే సరిపోతుంది. రెగ్యులర్ B.Tech, MS చేసేందుకు ఆరేళ్లు పడుతుండగా.. దీంతో ఐదేళ్లు మాత్రమే పట్టనుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ సేవరేజ్ అండ్ వాటర్ బోర్డు (HMWSSB) సప్లై మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతల స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వాటర్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరో జేఏసీ ఏర్పాటు అయింది. నేడు తెలంగాణ ఆర్టీసీలోని యూనియన్ల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ ఛైర్మన్‌గా ఈదురు వెంకన్న(EU), వైస్ ఛైర్మన్‌గా థామస్ రెడ్డి(TMU), కన్వినర్‌గా ఎండి మౌలానా(NMU), కో కన్వీనర్లుగా సుద్దాల సురేష్(BWU), కత్తుల యాదయ్య(BKU), యాదగిరి నియమితులయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై దర్యాప్తు చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ భూమిపై నోటీసులు ఇచ్చి రెండు వైపుల వాదనలు వినాలని ఎమ్మార్వోను ఆదేశించింది. పెద్దషాపూర్లో మాజీ సైనికుల కోటాలో కేటాయించిన మూడెకరాల్లో రెండెకరాలను ఖారిజా ఖాతాగా పేర్కొంటూ కలెక్టర్‌కు ఎమ్మార్వో రాసిన లేఖను మాజీ సైనికుడు శ్యాంసుందర్‌రావు హైకోర్టులో సవాల్ చేయడంతో మంగళవారం విచారించింది.
Sorry, no posts matched your criteria.