RangaReddy

News August 7, 2024

HYDలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు

image

బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేశారని, వ్యంగ్యంగా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రాష్ట్రీయ వానరసేన‌ ఫిర్యాదు చేసింది. మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు తీసిన రవి కుమార్(బిత్తిరి సత్తి)పైన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదులో పేర్కొంది.

News August 7, 2024

HYD: BRS పనైపోయింది: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో BRS పనైపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలో ఆయన మాట్లాడారు. BJPకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నామని, ప్రజలు BJPని ఆదరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. మీ కామెంట్?

News August 7, 2024

HYD: మందు కోసం ఫ్లై ఓవర్‌ నుంచి దూకేశాడు!

image

నగరంలోని PVNR ఎక్స్‌ప్రెస్‌ వే పైనుంచి ఓ వ్యక్తి దూకేశాడు. అత్తాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంబాగ్‌లో నివాసముండే అంబదాస్ (40)‌కు వివాహం కాలేదు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తన తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో గొడవ పెట్టుకొని బయటకెళ్లిపోయాడు. మనస్థాపంతో అత్తాపూర్‌లోని PVNR ఎక్స్‌ప్రెస్‌ వే పైకి ఎక్కి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

News August 7, 2024

హైదరాబాద్‌: ఓయూలో ఇవి నిషేధం

image

ఉస్మానియా యూనివర్సిటీ‌ వెళ్లేవారికి ముఖ్య గమనిక. క్యాంపస్‌ విద్యార్థు‌లకు ఇబ్బందులు కలగకుండా పలు నిషేధాలు విధించారు.
☛జంతుబలి నిషేధం
☛ఔటర్స్‌ సోషల్ మీడియా రీల్స్‌ కోసం రావొద్దు
☛డ్రైవింగ్ నేర్చుకునేవారికి క్యాంపస్‌లో‌ నో ఎంట్రీ
☛పెంపుడు జంతువులను ల్యాండ్‌ స్కేప్‌లో తీసుకురావొద్దు
అసాంఘిక కార్యక్రమాలు చేయరాదని క్యాంపస్ అంతటా బ్యానర్లు‌ ఏర్పాటు చేశారు. 24/7 సెక్యూరిటీ పర్యవేక్షిస్తున్నారు.
SHARE IT

News August 7, 2024

More 31 Days: హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఫెస్టివల్‌

image

మరో బిగ్గెస్ట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. వినాయకచవితి‌ వేడుకల‌ నిర్వహణ‌కు భాగ్యనగర్‌ ఉత్సవ సమితి, ఇతర అసోసియేషన్‌ సభ్యులు‌ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ధూల్‌పేటలో భారీ గణనాథుల బుకింగ్స్‌ మొదలయ్యాయి. మండపాల నిర్వహకులు బ్యాండ్‌ షాప్‌‌ల వైపు‌ పరుగులు తీస్తున్నారు. నాగోల్, హయత్‌నగర్‌లోనూ విభిన్న రకాల గణనాథులు కొలువుదీరారు. నవరాత్రులకు మరో 31 రోజులే సమయం ఉంది.

News August 7, 2024

ప్రొ. జయశంకర్‌ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం: సీఎం

image

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నికుడు , సిద్ధాంతకర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన కృషిని, త్యాగాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధ‌నే ఉచ్ఛ్వాస‌ నిచ్వాసలుగా జీవిత ప‌ర్యంతం గ‌డిపిన ప్రొ.జ‌య‌శంక‌ర్‌ను తెలంగాణ స‌మాజం స‌దా గుర్తుంచుకుంటుంద‌ని తెలిపారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొన‌సాగిస్తామ‌ని, ఆశ‌య సాధ‌న‌కు ప్రభుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉందన్నారు.

News August 6, 2024

HYD: RRRకు మార్గం సుగమం

image

రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియకు అడ్డుగా ఉన్న అటవీ శాఖ అనుమతుల అంశం కొలిక్కి వచ్చింది. భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పటంతో ఆ ప్రక్రియ తుది దశకు చేరింది. అటవీ అనుమతులు రాగానే.. NHAI కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయనుంది. ప్రస్తుతం 162 కి.మీ. ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది.

News August 6, 2024

FLASH: HYD: రోడ్డు ప్రమాదం.. తెగిపోయిన తల

image

శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంతో వెళ్తూ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది. ఈడ్చుకొని వెళ్లడంతో తల తెగి కారు వెనక సీటులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 6, 2024

HYDలో JOBS.. జీతం రూ.55 వేలు

image

HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)తోపాటు జోనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఐటీఐ, బీఈ/ బీటెక్ పాసై అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 30-33 ఏళ్లు మించకూడదు. రూ.22,528-రూ.55,000 వరకు జీతం ఉంటుంది. AUG 8 దరఖాస్తు చివరి తేదీ. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/job_details_17_2024.php

News August 6, 2024

FLASH: HYD: రోడ్డు ప్రమాదం.. తెగిపోయిన తల

image

శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంతో వెళ్తూ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తల కారు అద్దంలో ఇరుక్కుపోయింది. ఈడ్చుకొని వెళ్లడంతో తల తెగి కారు వెనక సీటులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.