India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SC, ST రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు 21న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణస్వరూప్ కోరారు. నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు. INC సహకారంతో మోదీ ఈ తీర్పు చెప్పించారని విమర్శించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు బంద్‌లో పాల్గొనాలన్నారు.
శ్రావణ మాసం మొదలుకావడంతో నగరంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆదివారం వరకు రాజధానిలో బోనాల సంబరాలు నిర్వహించారు. దీంతో మాంసంకు డిమాండ్ పెరిగింది. కేజీ చికెన్ రూ. 200 పైననే విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 148, స్కిన్‌లెస్ ధర రూ. 168, ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102గా ఉంది. SHARE IT
సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలుస్తోంది. సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న నగదును లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రీఫండ్ చేస్తోంది. మార్చి నుంచి జులై వరకు రూ.85.05 కోట్ల నగదును రీఫండ్ చేసింది. నగదు పొగొట్టుకున్న మొదటి గంట(గోల్డెన్ అవర్)లో ఫిర్యాదు చేస్తే నేరగాళ్లకు సొమ్ము చేరకుండా ఆపగలమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఇతర ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం జరిగింది.
HYD కూకట్‌పల్లికి చెందిన జ్ఞానవర్షిని TGPSC వెల్లడించిన ఫలితాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎంపికైంది. ఈ ఉద్యోగమే కాకుండా ఇంకా (AE),TPBO, గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించింది. కాగా జ్ఞానవర్షిని స్వగ్రామం పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండలం దేశయిపల్లి. కాగా ఆమెను పలువురు అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.
జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర హౌసింగ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.6కోట్లతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో 4 సూటెడ్ R&B గెస్ట్ హౌస్ నిర్మాణ పనులకు, ఆలంపల్లి నుంచి రాళ్లచట్టంపల్లి వరకు రూ.12 కోట్ల అంచనా వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తామని BRS నాయకులు అన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయ్యారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేస్తామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ వాదులతో జరగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్, హరీష్ రావు తదితరలు పాల్గొన్నారు.
సైబరాబాద్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. రాంరెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఆరోపణలపై షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.