India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
RR జిల్లా కలెక్టర్ శశాంక అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ✓LRS అప్లికేషన్లో ప్రాసెసింగ్‌పై చర్యలు చేపట్టాలి. ✓పెండింగ్ ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ✓అంగన్వాడి కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలి. ✓జిల్లావ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం విజయవంతం చేయాలి. ✓రైతు రుణమాఫీపై రైతులకు సమాచారం అందించండి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాగి వాహనాలు నడిపి 309 మంది బాబులు పోలీసులకు పట్టుబడ్డారు. కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 309 మందిలో అత్యధికంగా 211 మంది ద్విచక్ర వాహనదారులు కాగా.. 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కారు, ఒకరు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు.
పద్మ పురస్కారాల గ్రహీత, ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల రాష్ట్ర CM రేవంత్ రెడ్డి HYDలో సంతాపం తెలిపారు. భరత నాట్య, కూచిపూడి నృత్య కళకు యామినీ విశిష్ట సేవలందించారని, ఎంతో మంది యువతకు నాట్యం నేర్పించి దేశంలోనే కళారంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
దోస్తానా అంటే HYD, రంగారెడ్డి వాసులు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు రాజధానిలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడు ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. ఫెయిర్ వెల్ పార్టీలో కన్నీరు పెట్టిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
HYD శివారు ఆమనగల్లు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పులిగోనిపల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ (36) ఆమనగల్లు నుంచి తన ఆటోలో తండాకు వెళుతున్నాడు. హనుమాన్ ఆలయం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు SI వెంకటేశ్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 15 వేలు నమోదవుతుండగా.. కొత్త కేసుల్లో 13% సర్వైకల్ క్యాన్సర్ ఉంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్క HYD MNJ ఆస్పత్రిలోనే రోజూ 300-400 మందికి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తుండగా 2-3 కేసులు బయట పడుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో వ్యాక్సిన్ అందించినట్లు MNJ డైరెక్టర్ జయలత తెలిపారు.
మూడంతో 3 నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ రానుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30వ తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, శ్రావణ మాసం SEP3తో ముగుస్తుంది.
HYD సిటీలో బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ గాంధీ హాస్పిటల్ ఎదురుగా బస్ స్టాప్‌లో సంతకాల సేకరణ చేశారు. CPM నగర కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల ఉచిత బస్సు పథకం మంచిదే కానీ.. HYD నగర జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో నగరంలో 3,800 బస్సులు ఉండేవని, గత BRS ప్రభుత్వం మూడేళ్లలో 1,000 బస్సులు తగ్గించిందన్నారు.
HYD త్వరలో తిరుగులేని నగరంగా మారుతుందా అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. నగర శివారులో 200 ఎకరాల్లో AI సిటీ, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ హబ్, ఫార్మా విలేజెస్, మూసి ప్రక్షాళన, 800 ఎకరాల్లో టెక్స్ టైల్ వెల్ స్పన్, 300 ఎకరాల్లో కైటెక్స్, 250 ఎకరాల్లో ఫాక్స్ కాన్, 15 ఎకరాల్లో ఒలెక్ట్రా లాంటి భారీ కంపెనీల ఏర్పాటు పూర్తైతే HYDకు తిరుగు లేదంటున్నారు.
విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వంటివి యువతకు చేరడం, అర్థరాత్రిళ్లూ మద్యం అమ్మకాలు నేరాలకు కారణమవుతున్నాయి. మూడు కమిషనరేట్లలో మాదకద్రవ్యాలను అడ్డుకుంటున్నా ఏదో ఒక రూపంలో చేరుతున్నాయి. టీజీన్యాబ్ ఈ ఏడాది ఇప్పటి వరకూ 788 కేసుల్లో 1580 మందిని అరెస్టు చేసి రూ.74 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది. ఇందులో సగానికి పైగా రాజధాని HYD పరిధిలో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.