India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని HYD నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగూ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలోని 225 బస్తీ దవాఖానాల్లో జ్వరాలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నీరసం, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు బస్తీ దవాఖానల్లో చూపించుకోవాలని సూచించారు.
BRS ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ అన్నారు. MLA క్వార్టర్స్‌లో ఈరోజు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో BRS వాళ్లు కావాలనే తనను టార్గెట్ చేశారని, HYD అభివృద్ధిపై మాట్లాడనీయలేదన్నారు. సీఎంను, తనను కించపరిచారని, అందుకే సహనం కోల్పోయి అలా మాట్లాడానని, క్షమాపణ చెప్పానని పేర్కొన్నారు. పదేళ్లలో ఏనాడూ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు.
HYD మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచి 85% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికే కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇది అమలులోకి వచ్చిందని తెలిపారు. 15% అన్ రిజర్వుడ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్‌ను గోషామహల్‌లోని పోలీస్ క్వార్టర్స్‌కు తరలిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాత ఉస్మానియా భవనాన్ని హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గాంధీ ఆసుపత్రి జిరియాట్రిక్ వైద్య విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(NMC) ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో జిరియాట్రిక్ వార్డులుండగా, ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వయో వృద్ధులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గాంధీ మెయిన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.
HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. HYD టీమ్స్ ఆసుపత్రులను 14 అంతస్తులకే పరిమితం చేస్తామని, ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల హాస్టల్స్ భవనాలను రెండేళ్లలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు హెల్త్ టూరిజం హబ్ నిర్మించడం కోసం RR జిల్లాలోని షాబాద్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 500 నుంచి 1000 ఎకరాలు ఉంటే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు, ఐటి, ఫార్మా విలేజెస్ అంశాలను సైతం అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా భాగ్యనగర ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలోనే సాధారణంగా HYD ఫీవర్ ఆస్పత్రిలో 100-200 ఓపీ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 300 నుంచి 600కు చేరింది. జులై నెల మొదటి 19 రోజుల్లోనే 7089 ఓపీలు, 54 డెంగ్యూ కేసులు, 108 డిఫ్తీరియా కేసులు నమోదైనట్లు రిపోర్ట్ విడుదల చేశారు. 4 రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.
అసెంబ్లీ వేదికగా CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లండన్‌లో ఉన్న ‘లండన్ ఐ’ లాంటి టవర్‌ను HYDలోని మీర్‌ఆలం చెరువులో ‘హైదరాబాద్ ఐ’ పేరుతో నిర్మించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి చూస్తే నగరంలోని అందాలన్నీ కనిపించేలా టవర్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 2.6కి.మీ. పొడవుతో ప్రపంచంలోనే ది బెస్ట్ బ్రిడ్జుల్లోనే ఒకటిగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించనున్నారని, నెలరోజుల్లో దీని డీటెయిల్స్ ఇస్తామన్నారు.
ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.