RangaReddy

News August 2, 2024

HYDలో క్రేడాయ్ ప్రాపర్టీ షో

image

HYD హైటెక్స్ వద్ద క్రేడాయ్ ప్రాపర్టీ షో-2024 కొనసాగుతోంది. ఆగస్టు 4వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు, దేశీ విదేశీ కంపెనీల యజమానులు పాల్గొన్నారు. బడ్జెట్‌లో HYD నగర అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులు నగర అభివృద్ధి పై ప్రభావం చూపుతాయన్నారు.

News August 2, 2024

GHMCలో విలీనం కానున్న కార్పొరేషన్ల LIST

image

GHMCలో <<13752316>>విలీనం కానున్న<<>> మున్సిపల్ కార్పొరేషన్ల లిస్ట్ డ్రాఫ్ట్ బిల్లులో అధికారులు పొందుపరిచారు. ఇందులో RR జిల్లాలోని బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్ ఆమోదం తెలిపితే ఈ ప్రాంతాలు GHMCలో విలీనం కానున్నాయి. ఈ మేరకు పూర్తి వివరాలతో అధికారులు డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం చేశారు. SHARE IT

News August 2, 2024

HYD: 7వ అంతస్తుపై నుంచి పడి బాలిక మృతి

image

ప్రమాదవశాత్తూ బాలిక మృతి చెందిన ఘటన పేట్‌బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గోవన్ కుమార్తె రియా(13), కొడుకు అపార్ట్‌మెంట్‌లో 7వ అంతస్తులో ట్యూషన్‌కు వెళ్లి వచ్చారు. రియా పెన్ను మర్చిపోయానని వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా 7వ అంతస్తు నుంచి కింద రక్తం మడుగులో పడి ఉన్న కుమార్తెను గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News August 2, 2024

HYD: ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

image

ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి ఎల్‌బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) పి.విశ్వప్రసాద్‌ తెలిపారు. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలుంటాయని అన్నారు. రద్దీని బట్టి ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేయడం లేదా మళ్లిస్తామన్నారు.

News August 2, 2024

HYDలో పార్కింగ్ ఫీజు‌లపై ఆమ్రపాలి కాట సీరియస్

image

నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై తనిఖీలు చేయుటకు ప్రత్యేకంగా టీమ్స్ వేశారు. అక్రమాలు చేసిన ఆయా మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ చేశారు.

News August 1, 2024

HYD: యువతికి న్యాయం.. సెల్యూట్ పోలీస్

image

యువతిని మోసం చేసి ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించిన నిందితుడి ఆట కట్టించిన మహంకాళి పోలీసులను CP శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. CI పరశురామ్ టీమ్‌కు క్యాష్ రివార్డ్ అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన <<1374121>>అమ్మాయితో స్వామికి FB<<>>లో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించగా నిందితుడిని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి, న్యాయం చేశారు.

News August 1, 2024

మానవత్వం చాటుకున్న GHMC మేయర్

image

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవత్వం చాటుకున్నారు. గురువారం సా. KBR పార్క్‌కు ఆమె వాకింగ్‌కు వెళ్లారు. పార్క్ వద్ద నిస్సహాయస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని గమనించారు. స్వయంగా అతడి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఏమీ తినలేదని, ఒక కాలు కూడా లేదని సదరు వృద్ధుడు‌ తెలిపాడు. చలించిపోయిన ఆమె‌ వెంటనే DRF సిబ్బందిని పిలిపించారు. పోలీసుల సహాయంతో బేగంపేటలోని షెల్టర్ హోంకు తరలించారు.

News August 1, 2024

HYD: GHMCలో విలీనం కానున్న మున్సిపాలిటీలు!

image

HYD శివారు ప్రాంతాలు GHMCలో విలీనం కానున్నాయి. రంగారెడ్డి పెద్దఅంబర్‌పేట్, IBP, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే మేడ్చల్ మల్కాజిగిరిలోని దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ పోచారం.. సంగారెడ్డిలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంది.

News August 1, 2024

వెజ్ ఆర్డర్లలో HYDకు మూడో స్థానం

image

శాఖాహార వంటల ఆర్డర్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని స్విగ్గీ ప్రకటించింది. మసాలా దోశ, ఇడ్లీలను హైదరాబాదీలు ఎక్కువమంది ఇష్టపడుతున్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న 10 వంటకాల్లో 6 శాఖాహారం వంటకాలు ఉన్నాయని పేర్కొంది. తొలి రెండు స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి.

News August 1, 2024

HYD నగరవాసులకు BIG ALERT

image

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సులభతరం చేసేందుకు ప్రభుత్వం GHMC ప్రజాపాలన సేవాకేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సమాచారం, అప్లికేషన్ స్టేటస్ కోసం 6 జోన్లలోని 30 సర్కిళ్లలో 150 వార్డుల్లో కేంద్రాల్లో సంప్రదించేలా వీటిని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, సందేహాలకు నగర ప్రజలు ఏ సేవాకేంద్రంలో అయినా సంప్రదించవచ్చని తెలిపింది.