RangaReddy

News July 29, 2024

HYD: మమ్మల్ని వీడియోలో చూపించండి: హరీశ్‌రావు

image

ప్రస్తుతం అసెంబ్లీ కొనసాగుతోంది. కాగా సభ ప్రారంభించే ముందు MLA హరీశ్‌రావు మాట్లాడుతూ.. BRS ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు వీడియోలో చూపించడం లేదని ప్రజలే చెబుతున్నారని అనడంతో కుత్బుల్లాపూర్ MLA వివేకానంద అవునని అన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. అలా అనడం పొరపాటని, అందరినీ పర్‌ఫెక్ట్‌గా చూపిస్తున్నామని సమాధానం ఇచ్చారు.

News July 29, 2024

HYD: హాస్పిటళ్లకు పెరిగిన డయాలసిస్ పేషెంట్ల తాకిడి..!

image

HYD నగరంలో NIMS, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పేద రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మూడు ఆసుపత్రుల్లో 400-600 మంది వరకు నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ పేషంట్ల మరణాల రేటు HYDలో ఇది 8 శాతం వరకు ఉంటే జిల్లాల్లో 15 శాతం వరకు నమోదవుతోందని వైద్యులు తెలిపారు. అయితే జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు లేకపోవడంతో HYD నగరంలోని ప్రధానమైన 3 ప్రభుత్వ ఆసుపత్రులకు తాకిడి పెరిగింది.

News July 29, 2024

బేగంబజార్‌లో వ్యక్తి హత్య?

image

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు హత్యకు గురైనట్లు బేగంబజార్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. యాకుత్‌పుర వాసి మహ్మద్ అబ్దుల్ హకీం (72)కు ఫీల్ ఖానాలో ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ రిపేరింగ్ దుకాణం ఉంది. కాగా శనివారం మధ్యాహ్నం 3గంటలకు దుకాణానికొచ్చిన ఆయన తిరిగి ఆదివారం ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే సమాధానం లేకపోవటంతో కుమారుడు దుకాణానికి వచ్చి చూడగా రక్తం మడుగులో కనిపించాడు. కేసు నమోదైంది.

News July 29, 2024

అమెరికాలో HYDకు చెందిన యువకుడు మృతి

image

HYD రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. గత శనివారం (21న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన యువకుడు అక్షిత్ రెడ్డిది (26) స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా కాగా..HYD కాటేదాన్లో స్థిరపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి MS పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. జులై 27న మృతదేహం HYD చేరుకోగా.. స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు.

News July 29, 2024

HYD: బాలిక బ్రెయిన్ డెడ్.. పది మందికి ప్రాణదానం

image

బ్రెయిన్‌డెడ్ అయిన బాలిక అవయవాలతో మరో పది మందికి ప్రాణం పోశారు. మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు దీపిక(16) ఈనెల 22న ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరిక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. తల్లిదండ్రులు బాలిక అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. 25న బాలిక మృతి చెందటంతో అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు.

News July 29, 2024

రంగారెడ్డి: ఈ-ఆఫీస్‌ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

image

RR కలెక్టరేట్‌లో త్వరలోనే ఈ-ఆఫీస్‌ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న సేవలు.. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా సాగనున్నాయి. పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్‌ శశాంక వీలైనంత త్వరగా ఈ-ఆఫీస్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి సాంకేతిక నైపుణ్యంపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు.

News July 29, 2024

RR: ఆగస్టు 1న స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన

image

RR జిల్లా మహేశ్వరం అసెంబ్లీ ప్రాంతాన్ని మరో మహానగరంగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక్కడ దాదాపు 12 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉండగా వారి కంపెనీలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుండగా.. ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కందుకూరు మండలం మీరాఖాన్ పేట్ ప్రాంతంలో 57 ఎకరాలు కేటాయించగా.. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

News July 29, 2024

HYD: రూ.17 కోట్లతో ఆర్టీసీ బస్ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు

image

HYD నగరంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. రూ.17 కోట్లతో ఐదు డిపోల్లో EV బస్సుల ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్‌లో రూ.కోటీ 24 లక్షలు, మియాపూర్లో రూ.34 లక్షల వ్యయంతో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పూర్తయింది. బీహెచ్ఈఎల్‌లో రూ.3.9 కోట్లు, HCUలో రూ.2.49 కోట్లు, జేబీఎస్ రూ.9 కోట్లతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పనులు జరుగుతున్నాయి.

News July 29, 2024

GHMC పరిధిలో 521 క్రీడ మైదానాలు

image

GHMC ఆధ్వర్యంలో మొత్తం 521 క్రీడా మైదానాలు,29 స్పోర్ట్స్ కాంప్లెక్సులు,13 ఈత కొలనులు, 5 టెన్నిస్ కోర్టులు, 11 స్కేటింగ్ రింక్స్, 135 వ్యాయామశాలలు పని చేస్తున్నాయి.ఆయా వ్యాయామశాలల్లోని పరికరాలన్నీ తుప్పు పట్టి ఉన్నాయి.కొత్త పరికరాలను కొనుగోలు చేస్తున్నట్టు లెక్కలు చెబుతుంటే..వ్యాయామశాలల్లో మాత్రం అలాంటి వస్తువులేవి కనిపించచడం లేదు.GHMC కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ పట్టాలని ప్రజల కోరారు.

News July 29, 2024

గ్రేటర్ HYDలో క్రీడల పై GHMC నిర్లక్ష్యపు నీడలు..!

image

గ్రేటర్ HYD నగరంలో GHMC పరిధిలో క్రీడలను తేలికగా తీసుకుంటుంది.క్రీడల్లో పేద, మధ్య తరగతి యువతకు సరైన ప్రోత్సాహకం కరవవుతోంది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్రీడల కోసం కేటాయించిన నిధులను సగం మేర కూడా అధికారులు ఖర్చు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.2021-22 ఆర్థిక సంవత్సరంలో 32.78, 2022-235 64.48, 2023-24లో 38.48శాతం నిధులు ఖర్చయ్యాయి. సమ్మర్ క్యాంపులు సైతం అంతంత మాత్రంగానే జరిగాయి.