RangaReddy

News September 8, 2024

HYD: కొత్తపేటలో 54 అడుగుల కాలభైరవ మట్టి గణపతి

image

HYD కొత్తపేటలోని మోహన్ నగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణహితంగా భారీ మట్టి గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నుంచి గణపతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 54 అడుగుల కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ శిల్పి నగేశ్ మట్టి గణపతిని రూపొందించినట్లు తెలిపారు.

News September 8, 2024

HYD: బాలాపూర్ గణపతి ప్రత్యేకతలు ఇవే..!

image

HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

News September 7, 2024

HYD కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీలుగా వీరే!

image

HYD సిటీ కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీగా బాధ్యతలు చేపట్టిన వారిలో హసన్ అలీ ఖాన్ మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత B.N. కాలియా రావు, S.P.సాతూర్, విజయ రామారావు, ప్రభాకర్ రావు, అప్పారావు, RP సింగ్ IPS ఉన్నారు. ఇదే కోవలోకి 2021లో HYD సీపీగా విధులు నిర్వర్తించిన CV ఆనంద్ రానున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో 2024లో మరోసారి HYDకి సీపీ కానున్నారు. 1945 నుంచి 4 ఏళ్లకు మించి సీపీగా ఎవరూ లేరు.

News September 7, 2024

HYD: రాజ్‌భవన్‌లో వినాయక చవితి వేడుకలు

image

HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News September 7, 2024

HYD: డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను HYD బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మార్యదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు వ్యవసాయ కమిషన్ నూతన ఛైర్మన్ కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంను కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు, కార్పొరేషన్ ఛైర్మన్లు అనిల్ కుమార్, శివసేన రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఉన్నారు.

News September 7, 2024

HYD: గాంధీ భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

image

వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా HYD గాంధీ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్పొరేషన్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మహేశ్, శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు అల్లం భాస్కర్ పాల్గొన్నారు.

News September 7, 2024

FLASH: HYD: శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్‌కు నోటీసులు

image

హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్‌లో డ్రైనేజీ నీటితో ప్లేట్లు , గిన్నెలు , టీ గ్లాసులు కడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ బృందం రంగంలోకి దిగింది. తనిఖీలు చేపట్టిన అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే నోటీసులు జారీ చేశారు. మురుగు నీటితో ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 7, 2024

HYD: పెరగనున్న GHMC.. తగ్గనున్న HMDA

image

హెచ్ఎండీఏ పరిధిలోని కీలక ప్రాంతాలన్నీ ఇక నుంచి మహా బల్దియా పరిధిలోకి రానున్నాయి. దాదాపు 51 గ్రామాలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతం విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు. దాదాపు 841 గ్రామాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి బల్దియా కిందకు రానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ విస్తీర్ణం 5,872 చదరపు కిలోమీటర్లకు పరిమితం కానుంది. SHARE IT

News September 7, 2024

HYD: కాంగ్రెస్ FAIL.. ఇంకెంత మంది చావాలి..?: KTR

image

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఇంకెంత మంది రైతులు చావాలని..? BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్‌లో దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య గుండెను కలిచివేసిందని, ఇలాంటి బాధలు రావొద్దనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన KTR, రైతు వేదన వివరించలేనిదని పేర్కొన్నారు.

News September 7, 2024

HYD: 10వ తేదీ ‘ప్రజావాణి’ 11కు వాయిదా

image

బేగంపేట్ ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 570 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సీ వెల్ఫేర్ 77, రెవెన్యూ 57, పంచాయతీ రాజ్ 47, విద్యుత్ శాఖ 28, ఇతర శాఖలకు 93 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈనెల 10న జరగాల్సిన ప్రజావాణిని 11న నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి తెలిపారు.