India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✓HYD, RR, MDCL జిల్లాల్లో ఘనంగా జరిగిన బోనాలు
✓సికింద్రాబాద్: క్యూఆర్ కోడ్ ద్వారా గాంధీలో ఓపి
✓కల్వకుర్తి అసెంబ్లీకి రూ.309 కోట్ల నిధుల ప్రకటన
✓సికింద్రాబాద్: TGSRTC ప్రకటనల పై టెండర్లకు ఆహ్వానం
✓అబ్దుల్లాపూర్మెట్: గంజాయి మత్తులో బైకులు తగలబెట్టారు
✓అసదుద్దీన్ కొడంగల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం: బండి
ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
HYD సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ZPHS యూటర్న్ నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వరకు దాదాపుగా జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు 5 రోజుల పాటు SRDP శిల్ప లేఅవుట్ ఫేజ్-2 వంతెన పనులు జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పును 3 మీటర్లకు కుదిస్తామన్నారు.కావునా.. కొత్తగూడ నుంచి వచ్చేవారు రోలింగ్ హిల్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లాలన్నారు.
కల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కల్వకుర్తి అసెంబ్లీ RR జిల్లా పరిధి మండలాలైన ఆమనగల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.10కోట్లు, మాడ్గుల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3కోట్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్లు ప్రకటించారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రిని రూ.22 కోట్లతో నిర్మిస్తామన్నారు.
HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోగులు, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకుంటారు. వైద్యం కోసం వచ్చిన వారు ఓపీ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అలాంటి వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు.ఇక.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే ఓపీ టోకెన్ నంబర్ వస్తుందని, తద్వారా కౌంటర్లో ఓపీ రిజిస్ట్రేషన్ ఫామ్ అందిస్తారన్నారు. అనంతరం వెంటనే వైద్యం చేయించుకోవచ్చన్నారు.
హరేరామ, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ జరిగింది. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
HYD మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులు కొత్తరూపు దాల్చనున్నాయి. విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇది వరకే 15 చెరువు లను ఎంపిక చేసి కొన్ని పనులు చేపట్టింది.తాజాగా ఏడు జిల్లాల పరిధిలో మరో 45 చెరువులను అభివృద్ధి చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది.HMDA పరిధిలోని అనేక చెరువు ఆక్రమణలు, కలుషిత జలాలు,పూడికతో నిండిపొగా..సర్వేలతో ముందడుగు వేస్తోంది.
HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి MGBS రీజియన్లలో ప్రకటన బోర్డుల ఏర్పాటుకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లుగా TGRTC ఎండి సజ్జనార్ తెలిపారు. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. టెండర్ సంబంధించిన ఐడి వివరాలను X వేదిక ట్వీట్ చేశారు. మిగతా వివరాల కోసం https://tender.telangana.gov.in/ వెబ్ సైట్ సంప్రదించండి.
యువతులను వేధింపులకు గురిచేస్తున్న 125 మందిని ఇటీవలే షీ టీం బృందాలు పట్టుకున్నాయి. HYD రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషా విశ్వనాధ్ తెలిపారు. ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సప్, వీడియో కాల్, ఆడియో కాల్, అసభ్యకరంగా చూడటం, హేళన చేయడం, మహిళలు యువతుల వైపు దురుద్దేశంతో చూడడం లాంటివి చేస్తే..8712662111కి వాట్సప్ చేస్తే క్షణాల్లో అక్కడ ఉంటామన్నారు.
యువతులను వేధింపులకు గురిచేస్తున్న 125 మందిని ఇటీవలే షీ టీం బృందాలు పట్టుకున్నాయి. HYD రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషా విశ్వనాధ్ తెలిపారు. ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సప్, వీడియో కాల్, ఆడియో కాల్, అసభ్యకరంగా చూడటం, హేళన చేయడం, మహిళలు యువతుల వైపు దురుద్దేశంతో చూడడం లాంటివి చేస్తే..8712662111కి వాట్సప్ చేస్తే క్షణాల్లో అక్కడ ఉంటామన్నారు.
Sorry, no posts matched your criteria.