RangaReddy

News October 12, 2024

HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.

News October 12, 2024

HYD: బంగారు మైసమ్మ సన్నిధిలో CP సీవీ ఆనంద్

image

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పార్శీగుట్ట, మధురానగర్ కాలనీ బంగారు మైసమ్మను హైదరాబాద్ CP సీవీ ఆనంద్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీపీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి ప్రసాదం అందచేశారు. సీపీ నగర ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

News October 12, 2024

HYD: రేపు ఉప్పల్‌లో మ్యాచ్‌‌.. బజరంగ్ దళ్ నిరసన

image

రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-బంగ్లా మ్యాచ్‌లో జెండాలతో బజరంగ్ దళ్ శాంతియుత నిరసన తెలియజేస్తుందని దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని, హిందువులపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టినట్లు ఆయన వివరించారు. అంతేకానీ.. మ్యాచ్‌ను అడ్డుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

News October 11, 2024

ఆయుధ పూజలో చేసిన స్పీకర్

image

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నివాసంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ప్రజలకు స్పీకర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూజలో చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పామెన భీమ్ భరత్ ఓఎస్‌డీ వెంకటేశం, రఘుపతి రెడ్డి, నవాబ్‌పేట్ మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News October 11, 2024

HYD: అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎంకు ఆహ్వానం

image

గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి శుక్రవారం CM రేవంత్ రెడ్డిని అలయ్ బలయ్‌కు ఆహ్వానం అందించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 13న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

News October 11, 2024

HYD: CM రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలి: చెన్నయ్య

image

ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.

News October 11, 2024

HYDలో రేపు డబుల్ ధమాకా

image

హైదరాబాద్‌లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జతకానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా VS బంగ్లాదేశ్‌ T-20 మ్యాచ్ జరగనుంది. నగరం అంతటా ఇక సందడే సందడి. ఉదయం నుంచే ఆలయాలు, అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగం అంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికితోడు‌ రాత్రి మ్యాచ్‌ ఉండడంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు.

News October 11, 2024

జీహెచ్ఎంసీ పథకాలను ప్రశంసించిన ఏపీ అధికారులు

image

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను గురువారం సమీక్షించారు. ముఖ్యంగా ట్యాక్స్, ఫైనాన్స్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కంట్రోల్ రూమ్ వంటి విభాగాల్లో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు వివిధ విభాగాలలో తమ విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

News October 11, 2024

సొంతూళ్లకు ప్రయాణం.. హైదరాబాద్‌ ఖాళీ!

image

హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది. దసరా సెలవులకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు MGBS, JBS, ఉప్పల్ రింగ్‌ రోడ్‌ వద్ద బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లోనూ బయల్దేరడంతో సిటీ శివారుల్లోని టోల్‌గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, బీబీనగర్‌, దుద్దెడ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే నగరంలో ట్రాఫిక్ కాస్త తగ్గింది.

News October 11, 2024

తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి

image

తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.