RangaReddy

News July 27, 2024

HYD: KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు: MLA

image

నాటి KCR పాలనలో బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి, తెలంగాణ ప్రజల్లో ధైర్యం నూరిపోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ VKB జిల్లా చీఫ్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ బిల్లు పాసైన రోజు పార్లమెంట్‌లో KCR లేరని, విజయశాంతి ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిపోయారని అన్నారు. KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ మిత్ర కూటములంతా కలిసి సోనియాగాంధీని ఒప్పించడంతో వచ్చిందన్నారు.

News July 27, 2024

అందుకే HYD ప్రజలు BRSను గెలిపించారు: హరీశ్‌రావు

image

BRS పాలనలో HYDలో అభివృద్ధే జరగలేదని కాంగ్రెసోళ్లు అంటున్నారని, దాని గురించి మాట్లాడాలంటే 10 పేజీలు ఉన్నాయి చెప్పమంటారా అని MLA హరీశ్ రావు ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేశాం కాబట్టే హైదరాబాద్ ప్రజలు నిండు మనసుతో KCRను అశీర్వదించి దాదాపు అన్ని సీట్లలో BRSను గెలిపించారని అన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా HYDఅభివృద్ధి విషయంలో KCRను కొనియాడారని గుర్తు చేశారు.

News July 27, 2024

చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపాం: CM

image

అసెంబ్లీలో KCRపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నాడు రాజశేఖర్ రెడ్డిని నాటి సభ్యులు ఒప్పించి ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొద్దామనుకుంటే దానిని KCR మెదక్ వరకు నియంత్రించారని ఆరోపించారు. 3 వేల TMCల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా చూశారు కానీ చేవెళ్ల, VKB, తాండూరు, పరిగి, కొడంగల్‌కు నీళ్లు ఇవ్వలేదని, RRజిల్లాను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తుంటే చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపామన్నారు.

News July 27, 2024

HYD: HMWSSB ప్రక్షాళనతో బదిలీలు!

image

HYDలోని HMWSSB ప్రక్షాళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనరల్ మేనేజర్లు రవీందర్ రెడ్డి, సుబ్రమణ్యం, మహేందర్, సంతోశ్ కుమార్, సుబ్బా రాయుడు, సాయి లక్ష్మి, సీహెచ్ శ్యాంసుందర్ నాయక్, తిప్పన్న, సత్యనారాయణ, మరియారాజ్, సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ బదిలీ అయ్యారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని బదిలీ చేస్తున్నారు.

News July 27, 2024

HYD: మా MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మొత్తుకుంటారు: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెబుతున్న KCR.. RR జిల్లాలో ఎన్ని భూములు అమ్ముకున్నారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. గత BRS పాలనలో RRలో కనీసం డ్రైనేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణానికి నిధులివ్వలేదని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ఎప్పుడూ మొత్తుకుంటారని అన్నారు.

News July 27, 2024

HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

image

శామీర్‌పేట్‌లో శుక్రవారం <<13709545>>రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. హకీంపేట వాసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శేఖర్(25), మౌలాలి వాసి, ఐటీ ఉద్యోగి దీపిక(23) ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి HYD వైపు రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. తుర్కపల్లి సమీపంలో కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి ఎదురుగా వచ్చే బస్సును, బైక్‌ను ఢీకొట్టారు. శేఖర్, దీపిక చనిపోగా బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.

News July 27, 2024

HYD: లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూళ్లు

image

లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. శుక్రవారం జోనల్ అడిషనల్ కమిషనర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. సీఆర్ఎంపీ ద్వారా చేపట్టిన రోడ్లకు సంబంధించి ఏజెన్సీ లతో చేసుకున్న ఒప్పందం డిసెంబర్ వరకు గడువు ఉందన్నారు. దీంతో పెండింగ్ లో ఉన్న మెయింటెనెన్స్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

News July 27, 2024

HYD: చాక్లెట్‌లో ఈగ.. షాక్

image

HYD జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీల్స్ అఫైర్స్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యారు. ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఈగ ఉండడంతో అవాక్కయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించి త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News July 27, 2024

HYD: మహిళపై అత్యాచారం.. నటుడిపై కేసు

image

పెళ్లి పేరుతో నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నటుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..శ్యామ్‌లాల్ బిల్డింగ్స్ సమీపంలో నివసించే మహిళ(34)కు నటుడు అమన్ సింగ్(27)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2023OCTలో మహిళను తన ఫ్లాటుకు పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకోమనగా తప్పించుకొని తిరగడంతో బాధితురాలు శుక్రవారం PSను ఆశ్రయించింది.

News July 27, 2024

HYD: ప్రజావాణికి 681 దరఖాస్తులు

image

HYD ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 681 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూకు సంబంధించినవి 69, పౌరసరఫరాల శాఖవి 132, విద్యుత్‌ 87, హౌసింగ్‌ 232, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి 31, ఇతర శాఖలకు సంబంధించినవి 130 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.