RangaReddy

News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం..!

image

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటె‌క్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 19, 2024

RR: ‘సిబ్బందికి సెలవులు ఇవ్వకండి’

image

MP ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వివిధ శాఖల సిబ్బందికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బందికి సంబంధించిన ఇంటి చిరునామాలు, ఎపిక్‌ కార్డుల వివరాలు తప్పనిసరిగా అందించాలన్నారు. సిబ్బందికి సెలవులు ఇవ్వరాదని సూచించారు. ఈ మీటింగ్‌‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఉన్నారు.

News March 19, 2024

HYD: ‘ఎన్నికల ప్రచారం.. అనుమతి తప్పనిసరి’

image

ఎన్నికల ప్రచారం కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుందని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్‌గా అనుమతులు ఇవ్వమని కమిషనర్‌ స్పష్టం చేశారు. 10PM నుంచి 6AM లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దన్నారు. SHARE IT

News March 18, 2024

సికింద్రాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు పట్టాలు దాటుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలోని అల్వాల్, బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కాగా, పోలీసులు మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయసు 35ఏళ్ల లోపు ఉంటుందన్నారు. 5.5 అడుగుల ఎత్తు, కోల ముఖం, లైట్ క్రీమ్ కలర్ షర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడు.

News March 18, 2024

HYD: ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి

image

ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ GRP పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఆదివారం నీలం సుమంత్ తన తమ్ముడితో కలిసి సొంతూరు ఖమ్మం జిల్లా కల్లూరు వెళ్లడానికి SCBD రైల్వే స్టేషన్‌కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. అయితే ట్రైన్ ఎక్కే సమయంలో జారీ కింద పడ్డాడు. సుమంత్‌ను తమ్ముడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు.

News March 18, 2024

హైదరాబాద్‌లో వర్షం

image

హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. లింగంపల్లి, BHEL, చందానగర్, గచ్చిబౌలితో పాటు.. పలు ప్రాంతాల్లో కురిసింది. మీ ప్రాంతంలో కూడా వర్షం ఉంటే కామెంట్‌లో తెలపండి.

News March 18, 2024

HYD: ఢీకొట్టిన ట్రైన్.. కాళ్లు తెగి వ్యక్తి మృతి 

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అల్వాల్‌లో నివాసం ఉండే కే.దుర్గయ్య(41) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సనత్‌నగర్-అమ్ముగూడ రైల్వేస్టేషన్ల మధ్య అతడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగి, చికిత్స పొందుతూ మరణించాడు. 

News March 18, 2024

UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.

News March 18, 2024

దేవేందర్ గౌడ్‌ను కలిసిన ఈటల, కొండా

image

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తుక్కుగూడలోని వారి నివాసంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి, అందెల శ్రీరాములు, కేఎస్ రత్నం, నరసింహరెడ్డి, విక్రమ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్స్ కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి, పూలబొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం వారితో ముచ్చటించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

News March 18, 2024

FLASH.. HYD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ 44వ జాతీయ రహదారి MSN పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.