India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అభివృద్ధిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాదోపవాదాలు చేస్తున్నారు. నగరంలో ఫ్లై ఓవర్లు తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్ రావు ఘాటుగా బదులిచ్చారు. లోకం అంతా హైదరాబాద్‌ను మెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ గజినీలకు ఇది కనిపించదని ఎద్దేవా చేశారు. మరి గత 10 ఏళ్లలో నగర అభివృద్ధిపై హైదరాబాదీగా మీ కామెంట్?
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ నేడు సచివాలయంలో బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలోని నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో సచివాలయంలోని ద్వారాల వద్ద అమ్మవారు, ఆదిశేషుడు తదితర ప్రతిమలను ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం బోనాల వేడుకల్లో పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిధుల కేటాయింపు వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు వెల్లడించారు. HYD నగరానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
✓HYD అభివృద్ధికి రూ.10,000 కోట్లు
✓RRR(రీజినల్ రింగ్ రోడ్డు)- రూ.1525 కోట్లు
✓మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్- రూ.1500 కోట్లు
✓వాటర్ బోర్డు కోసం రూ.3,385 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో పలువురు వైద్యులు బదిలీ కావడంతో కంటి చూపు పరీక్షల కోసం వచ్చిన సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు ప్రొ.డాక్టర్లు, నలుగురు అసోసియేట్ డాక్టర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లు, ఫార్మాసిట్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, సిస్టర్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, స్వేకుంట్, గ్లకోమా అండ్ కార్నియాను సంబంధించిన సిబ్బంది బదిలీపై వెళ్లారు.
మలక్‌పేట్‌లో <<13702575>>బాలిక(8)పై అత్యాచారం<<>> జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. ఓ వైపు మెలిపెట్టే నొప్పి, మరోవైపు 15 రోజులుగా ఒకరి తర్వాత మరొకరు వేస్తోన్న ప్రశ్నలతో ఆ చిట్టితల్లి ఆందోళనకు గురైంది. మానసిన నిపుణులు వేసిన ప్రశ్నలకు బాలిక సరైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
HYDలో దారుణ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన అంధ బాలిక(8) మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఇటీవల చిన్నారికి రక్తస్రావం కావడంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి ఆమెను వైద్యులకు చూపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వారు నిర్ధారించారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే యువకుడి(23)పై అనుమానంతో PSలో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో ‘TG09A9999’ నంబర్ ఏకంగా రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ సంస్థ అంత మొత్తం చెల్లించి నంబరును సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ‘TG09 B’ సిరీస్‌లో ‘0001′ నంబరును రూ.8.25 లక్షలు చెల్లించి ఎన్‌జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ దక్కించుకుందని జేటీసీ రమేశ్ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.51,17,514 ఆదాయం సమకూరిందని వివరించారు.
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికుల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్‌లో యువకుడిని హత్య చేశారు. మంగళవారం రాత్రి మహమ్మద్ ఖాజా పాషా(ర్యాపిడో డ్రైవర్), అతడి స్నేహితుడు పర్శకు గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో పాషాపై కర్రతోదాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వనమహోత్సవం, మహిళా శక్తి, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ శశాంక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా వర్షాకాలంలోనే మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
Sorry, no posts matched your criteria.