India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కలిసి.. తండ్రి కేసీఆర్, తల్లి శోభమ్మలకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్.. మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.
హైదరాబాద్‌లో కుక్కల దాడి రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో సైతం ఈరోజు ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో జరగగా.. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకూరు గ్రామంలో మంగళవారం జరిగిన మసీదు నిర్మాణ పనులను నిలిపివేయాలని RSS, బజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ నాయకులు ‘చలో చిలుకూరు’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో మొయినాబాద్ PS పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు లూటీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD చెందిన వ్యాపారవేత్తకు ఓ లింక్ ద్వారా క్వాంటమ్ క్యాపిటల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. మొదటగా బిట్ కాయిన్ పై కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.3.5 లక్షలు పెట్టుబడి మోసపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేంద్ర బడ్జెట్‌లో HYDకు ప్రాధాన్యత దక్కలేదని తెలంగాణవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణకు నిధులు ఇవ్వాలని INC ప్రభుత్వం కోరినా.. కేటాయింపులు ఇవ్వలేదన్నారు. మూసీతో పాటు జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ. 10 వేల కోట్లు అడిగితే పైసా ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ వాహనదారులకు ముఖ్యగమనిక. అంబర్‌పేట ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే 6 నంబర్ నుంచి అంబర్‌పేట జంక్షన్ వరకు రోడ్డు క్లోజ్ చేశారు. ఇక నేటి నుంచి 6 నంబర్ నుంచి గోల్నాక రూట్ కూడా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. జిందా తిలిస్మత్ మీదుగా గోల్నాక చేరుకోవచ్చు. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని రూట్ మ్యాప్ విడుదల చేశారు.
IT ఉద్యోగులకు RTC శుభవార్త చెప్పంది. HYD శివారు నుంచి హైటెక్‌సిటీకి రావాలంటే సికింద్రాబాద్, కోఠి తదితర బస్టాప్‌ల మీదుగా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 నుంచి 4 బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే ఘట్‌కేసర్ నుంచి హైటెక్‌సిటీకి స్పెషల్ సర్వీసులు తీసుకొచ్చారు. మరో 40 రూట్‌లలోనూ ఈ విధంగా సేవలు అందించేందుకు RTC కసరత్తు చేస్తోంది.
అమరావతి నిర్మాణం కోసం రూ. వేల కోట్లు ఇస్తున్న కేంద్రం హైదరాబాద్‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని CM రేవంత్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. HYD మెట్రో విస్తరణ, మూసీ డెవలప్‌మెంట్, RRR ప్రాజెక్ట్‌కు ఏమీ ఇవ్వలేదన్నారు. కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడేందుకు, మెట్రో కోసం బడ్జెట్‌ను సవరించి నిధులు ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
✓తెల్లాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిరణ్ ఆత్మహత్య
✓OU: IAS స్మిత సబర్వాల్ ఫొటోలు దగ్ధం
✓యువతులు, మహిళలను వేధిస్తే వదిలిపెట్టం:CP
✓సికింద్రాబాద్:గాంధీ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్ రాజకుమారి
✓8 సీట్లు ఇచ్చినా.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది: చాడ
✓HYD: దాదాపు 200 ఫోన్ల రికవరీ పూర్తి
✓VKB: అనంతగిరి పచ్చటి అందాల..సొగసులు..!
✓సికింద్రాబాద్:రైల్వే టికెట్ల స్కాం.. బట్టబయలు
HYD శివారు తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను లెటర్‌లో రాసి తనువు చాలించాడు.
Sorry, no posts matched your criteria.