RangaReddy

News July 23, 2024

గాంధీ ఆస్పత్రికి కొత్త సూపరింటెండెంట్

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డా.CHN.రాజకుమారి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పేదలకు కార్పొరేట్​ స్థాయి వైద్యం అందించే ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం మెడికల్​ టీమ్‌తో కలిసి సమష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు. చక్కటి వైద్యం, మెడికల్ విద్యకు టాప్​ ప్రియారిటీ ఇస్తామన్నారు.

News July 23, 2024

HYD: 3 రోజులు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్‌నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.

News July 23, 2024

RR: రైతులకు GOOD NEWS.. దరఖాస్తు చేసుకోండి..

image

RR,MDCL,VKB జిల్లాల్లో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. నూతనంగా భూమి కొనుగోలు చేసిన వారు, నూతనంగా రైతు పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన వారు రూ.5 లక్షల రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం క్లస్టర్ AEO అధికారిని సంప్రదించాలి.18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. జులై 30లోపు అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 23, 2024

HYD: IAS స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై నిరసనలు..!

image

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్‌కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

News July 23, 2024

HYD: రైల్వే టికెట్ల SCAM.. జర జాగ్రత్త..!

image

సికింద్రాబాద్ RPF బృందం ఆపరేషన్ ఉపలబ్ద్ చేపట్టింది. అక్రమ రైల్వే ఈ-టికెటింగ్ స్కామ్‌ పై ఉక్కుపాదం మోపింది. ఒకరిని అరెస్టు చేసి రూ.1.1 లక్షల విలువైన 37 ఈ-టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ టిక్కెట్లను విక్రయించే వారి మాయ మాటలకు బలైపోకండని, ఎల్లప్పుడూ సమాచారాన్ని ధ్రువకరించుకోవాలని పోలీసులు సూచించారు. అంతేకాక అదనపు మొత్తాన్ని చెల్లించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.

News July 23, 2024

HYD: లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు

image

డీజీపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన HYD నగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.

News July 23, 2024

JNTUలో ముగిసిన PHD పరీక్షలు

image

HYD కూకట్‌పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.

News July 23, 2024

HYD: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన BRS ఎమ్మెల్యేలు

image

ఈరోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా గన్ పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, వివేకానంద తదితరులు హాజరుకానున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో లాస్య నందిత మృతిపై సంతాపం తెలపనున్నారు.

News July 23, 2024

HYD: గుర్రం తన్నింది.. యువకుడి మృతి

image

గుర్రం తన్నడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. HYD పాతబస్తీ పరిధి శాలిబండ PS ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాలు.. చాంద్రాయణగుట్ట వాసి ఇబ్రాహీం(17) ఈనెల 17న మొహర్రం ఊరేగింపు తిలకించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంజిన్ బౌలి ప్రాంతంలో గుర్రాలు వెళుతుండగా వాటి వెనుక పరిగెత్తాడు. ఒక గుర్రం తన్నడంతో అతడు గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.

News July 23, 2024

HYD: బడ్జెట్ పైనే బల్దియా ఆశలు..!

image

బడ్జెట్ పైనే GHMC ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు SRDP, SNAP ప్రాజెక్టులతోపాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన CRMP కార్యక్రమాల కోసం బల్దియా రూ.6,500కోట్ల పైచిలుకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వస్తున్న ఆదాయం అప్పులు, మిత్తీలు చెల్లించేందుకు కూడా చాలకపోవటంతో అధికారులు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు తలలు పట్టుకుంటున్నారు.