RangaReddy

News July 23, 2024

HYDలో కుక్కల బెడద.. GOOD NEWS

image

HYDలో కుక్కల బెడద కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గుడ్ న్యూస్ తెలిపారు. కుక్కల బెడద నివారించేందుకు ఇకపై ప్రత్యేక అపెక్స్ కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. పలు శాఖల అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. మరోవైపు HYDలో వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తామని GHMC తెలిపింది. 

News July 23, 2024

రాజేంద్రనగర్: ముర్ర జాతి పశువులతో మేలు!

image

HYD నగరం రాజేంద్రనగర్ వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు ముర్ర జాతి పశువులతో ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ముర్ర జాతి పశువులు పొడువైనా మెడ, వెడల్పు కలిగిన మూతిని కలిగి ఉంటాయన్నారు. అత్యధికంగా పాలు సైతం అందిస్తాయని తెలిపారు. మరో జాతికి చెందిన పశువులను పెంచే వారు, యూనివర్సిటీకి వచ్చి తగిన సూచనలు పొందవచ్చన్నారు.

News July 23, 2024

RR: తాము ఎలాంటి జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

RR జిల్లాకు చెందిన సుమారు 40 మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పదోన్నతులు, బదిలీల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని సింగల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ అప్పీలు కొట్టి వేసింది. ఈ అంశంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిజెప్పింది.

News July 23, 2024

HYD: స్టాక్స్‌లో లాభాలని రూ.16.73 లక్షలు లూటీ

image

స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

HYD: డెంగ్యూ డేంజర్ బెల్స్.. జాగ్రత్త!

image

HYD మహానగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 90 రోజుల్లో ఏకంగా 200 కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మే నుంచి పరిశీలిస్తే.. ప్రతి నెలా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రికి 350 మందికి పైగా వస్తుండగా ఓపీ ఇస్తున్నారు. మరోవైపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోనూ జ్వరంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. జాగ్రత్త..!

News July 23, 2024

HYDలో కాలుష్య భూతం.. జాగ్రత్త!

image

గ్రేటర్ HYDలో కాలుష్య భూతం మెల్లమెల్లగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. PM 2.5 వ్యాసం కలిగిన సూక్ష్మ ధూళికణాలు గత 4 నెలల రికార్డులను పరిశీలిస్తే జూపార్కు ప్రాంతాల్లో 115, పాశమైలారం 104, బాలానగర్ 101, ఉప్పల్ 89, జీడిమెట్ల 107, ప్యారడైజ్ 96 మైక్రాన్లుగా నమోదైంది. సాధారణంగా 40 మైక్రాన్ల లిమిట్ దాటితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

News July 23, 2024

HYD: ముందడుగు.. విజన్-2047లో RRR..!

image

HYD చుట్టూ RRR నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే భారత్ మాల-1లో ఉత్తర భాగం, భారత్ మాల-2ప్రాజెక్టులో దక్షిణ భాగం అభివృద్ధి చేయాలని భావించినా దక్షిణ భాగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ప్రస్తుతం కేంద్రం తాజాగా విజన్-2047లో చేర్చినట్లుగా సమాచారం. దక్షిణభాగం ఆమనగల్, షాద్‌నగర్,చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉండనుంది.

News July 22, 2024

HYD: నేటి TOP NEWS

image

✓సికింద్రాబాద్: కోలాహలంగా మహంకాళి ఫలహారం బండ్ల ఊరేగింపు
✓మేడ్చల్: అత్వెల్లి ఎస్టేట్‌లో మహిళ పుర్రె కలకలం
✓రాచకొండలో నేరాలను అరికట్టాలి: సుధీర్ బాబు
✓పాతబస్తీ బోనాలకు గవర్నర్ రాధాకృష్ణకు ఆహ్వానం
✓దమ్మాయిగూడ: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమిషనర్
✓గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు బదిలీ
✓HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

News July 22, 2024

HYD: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

HYDలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్‌లో మరో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. బాలిక అరుపులు విన్న స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

News July 22, 2024

గాంధీ ఆస్పత్రిలో భారీగా బదిలీలు.. పేషంట్లపై ఎఫెక్ట్..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది బదిలీ కావడంతో పేషంట్లకు అందించే వైద్య సేవలు, మెడికల్ స్టూడెంట్లపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు. 42మంది ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితర డిపార్ట్‌మెంట్ల వైద్య​ సిబ్బందితో పాటు 23మంది నాన్​ మెడికల్ సిబ్బంది ట్రాన్స్​ఫర్​ అయినట్లు అధికారులు తెలిపారు.