India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్‌లోని కమీషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్థులను పట్టుకోవడానికి నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.
HYD పాతబస్తీలోని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ సోమవారం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీశ్, రాజారత్నం కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈనెల 18వ తేదీన ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభించామని తెలిపారు.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఆయన లేఖ రాశారు. పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కేంద్రంలో ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వారి కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా రేపు ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. కొవిడ్ పాండమిక్‌లో వేలాది మంది పేషెంట్ల ప్రాణాలను తన మెడికల్ టీంతో కలిసి కాపాడిన ఆయన సేవ భావానికి అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈరోజు తన బాధ్యతల నుంచి రిలీవ్ అయిన రాజారావును ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించి, వీడ్కోలు చెప్పారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్‌మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.
గ్రేటర్ HYD పరిధి ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. GHMC హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆదివారం, సోమవారం 2 రోజుల వ్యవధిలో దాదాపు 25 సెల్‌ఫోన్లు, 15 గ్రాముల బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయని బాధితులు మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1,500 మంది పోలీసుల బందోబస్తు, 100కు పైగా CC కెమెరాలున్నా దొంగలు తమ చేతివాటాన్ని చూపారు.
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని BC సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.