RangaReddy

News September 7, 2024

HYD: లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: సీఎండీ

image

విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-234548845, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT

News September 7, 2024

HYD: రెండు దశల్లో కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం

image

భారీ ఆక్రమణలతో కునారిల్లిన రాజధానిలోని నాలా వ్యవస్థను గాడిలో పెట్టాలని కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాచరణ రూపొందించింది. రెండు దశల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా శుక్రవారం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వంద మంది అధికారులు, సిబ్బంది పరిశీలన మొదలు పెట్టారు. నాలాలపై వరదకు అడ్డుపడుతున్న భవనాలను గుర్తించనున్నారు. అనంతరం 2 దశల్లో వాటిని కూల్చివేయనున్నారు.

News September 7, 2024

ప్రజలకు హైదరాబాద్ మేయర్ శుభాకాంక్షలు

image

వినాయక చవితి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఆమ్రపాలి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల విజ్ఞానలు తొలగించే వినాయకుడి అనుగ్రహం నగర ప్రజలందరికీ కలగాలని, అందరి ఇంట సుఖశాంతులు వెళ్లివిరియాలని ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా నగరం మరింత అభివృద్ధి చెందాలని వారు అభిలాషించారు.

News September 7, 2024

HYD: ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వద్దు: ఎండీ

image

గ్రేటర్ HYDలోని పలు ప్రాంతాల్లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంచి నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎండీ అసహనం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి సేవలపై ఆరా తీశారు.

News September 7, 2024

BREAKING: HYD: బాలుడి దారుణ హత్య

image

బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు షాద్‌నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కట్టప్ప(6) కుమారుడు. ఉన్నాడు. ఎల్లయ్య అనే వ్యక్తి రాత్రి దుర్గయ్యకు చెందిన పందులను దొంగిలించేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని బాలుడు కట్టప్ప గమనించడంతో ఎవరికైనా చెబుతాడేమోనని భావించి బాలుడిని బండకేసి బాదడంతో మృతిచెందాడు.

News September 7, 2024

HYD: ‘మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలి’

image

వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్తు భద్రతా చర్యలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారప్ ఫరూఖీ HYDలో సూచించారు. మండపాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా, భద్రత ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని సమీక్ష సమావేశంలో వెల్లడించారు. మండపాలకు విద్యుత్తు సరఫరా కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కకుండా సిబ్బందితోనే కనెక్షన్ తీసుకోవాలన్నారు. వైరింగ్ అసంపూర్తిగా ఉంటే వర్షాల వేళ షాక్ వచ్చే ప్రమాదముంటుందన్నారు.

News September 7, 2024

HYD: గణేశ్ నిమజ్జనానికి 73 పాండ్స్

image

గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌‌లో విగ్రహ నిమజ్జనం చేయడానికి ప్రజలకు అందుబాటులో 73 లొకేషన్లలో వివిధ రకాల పాండ్ ‌లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసినట్లు కమిషనర్ అమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా 73 పాండ్ ‌లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో పెద్ద విగ్రహాలు కాకుండా 2 నుంచి 5 ఫీట్ల చిన్న విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశామన్నారు.

News September 7, 2024

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

image

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అంటే ఈనెల 17వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన కోరారు.

News September 7, 2024

హైదరాబాద్ అంతా NIGHT OUT

image

వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్‌పేట్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.

News September 7, 2024

తప్పని పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లా: బండిసంజయ్

image

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని కేంద్రమత్రి బండి సంజయ్ HYDలో అన్నారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం TG, APకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇదీ రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.