India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘బాలికలపై లైంగిక వేధింపులను ఆపండి.. పిల్లలని చైతన్యపరుద్దాం’ అంటూ రాచకొండ కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు.
☛ప్రవర్తనలో ఆకస్మిక మార్పు
☛ఇతరుల నుంచి దూరంగా ఉండటం
☛శరీరంలో అనుమానాస్పద, వివరించలేని మార్పులు
☛భయపడుతూ ఉండటం
☛ఆహారం, నిద్రలో మార్పులు ఉంటే ఆరా తీయాలన్నారు. ఇదే సమయంలో పిల్లలకు కీలక సూచన చేశారు. శరీర భాగాలను ఎవరైనా తాకితే పేరెంట్స్ లేదా 1098, 100, 101కు డయల్ చేయాలన్నారు.
SHARE IT
✓సనత్ నగర్: కరెంటు షాక్ తగిలి ముగ్గురు మృతి
✓సికింద్రాబాద్: మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్
✓గ్రేటర్ HYD పరిధిలో త్వరలో రూ.5 లకే టిఫిన్..!
✓గ్రేటర్ HYDలో DRF నూతన టెక్నాలజీ
✓అన్ని జిల్లాల్లో BCG టీకాతో క్షయ వ్యాధికి చెక్
✓సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క
రైతు రుణమాఫీ పేరిట సైబర్ నేరస్థులు కొత్త పంథాలో బ్యాంకు ప్రొఫైల్ పేరిట వాట్సప్ ద్వారా మెసేజెస్, APK ఫైల్స్ పంపిస్తున్నారని HYD రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా గూగుల్, ఫోన్‌పే లాంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తున్నారన్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గ్రేటర్ HYDలో వర్షం వచ్చినప్పుడు వరద నీటి లోతుల్లోని వాహనాలను, వాహనాల్లో చిక్కుకున్న మనుషులను గుర్తించడం హ్యాండ్‌హెల్డ్ సోనర్ స్కానర్‌తో ఈజీ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. దాదాపు 164 అడుగుల లోతు వరకు వెళ్తుంది. 2 నిమిషాల్లో 43 వేల చదరపు అడుగుల వరకు స్కాన్ చేసి, నీటి లోపల ఉన్న వాటి చిత్రాలను పంపిస్తుంది. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతుంది.
మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో వివిధ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లో BCG టీకాను కింది పేర్కొన్న వారికి అందిస్తారు.
✓ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడిన వారికి
✓BMI శరీర ద్రవ్యరాశి సూచిక 18 కన్నా తక్కువ ఉన్నవారికి
✓ మద్యపానం తాగేవారికి
✓కొన్ని ఏళ్లుగా ధూమపానం తాగే వారికి
✓క్షయవ్యాధి ఉన్నవారి కుటుంబసభ్యులకు ✓ 5 ఏళ్లుగా క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి అందించనున్నారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం 12 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించింది. ఇద్దరు హ్యూమన్ ట్రాఫికర్లు చిన్నారులను ఎత్తుకెళ్లడానికి యత్నించగా.. పక్కా సమాచారంతో రెస్క్యూ చేసి పిల్లలను రక్షించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని HYD ఆధార్ సెంటర్ అధికారులు చూపించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.
గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.
Sorry, no posts matched your criteria.