RangaReddy

News July 21, 2024

HYD: ఐటీ కంపెనీలకు ఆర్టీసీ అద్దె బస్సులు

image

HYD నగరంలోని కొండాపూర్, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిత్యం సుమారు 20 వేల మంది ఉద్యోగులు కార్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య రోజుకు రోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ తగ్గించేందుకు పలు ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని ఎండీ సజ్జనార్ హామీ ఇచ్చారు.

News July 21, 2024

HYD: మహంకాళికి బోనం సమర్పించిన కేంద్ర మంత్రి

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో వందల ఏళ్ల నుంచి బోనాల పండుగ సంప్రదాయం జరుపుతున్నామన్నారు. ఎక్కడా లేని బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

News July 21, 2024

సికింద్రాబాద్: బంగారు బోనం.. కవిత దూరం!

image

లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 21, 2024

HYD: UPDATE.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం

image

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ <<13674116>>ఆత్మహత్యాయత్నానికి <<>>పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

News July 21, 2024

HYD: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

News July 21, 2024

HYD: వరద నివారణ చర్యల్లో యంత్రాంగం

image

అధికార యంత్రాంగమంతా వరద నివారణ చర్యల్లో ఉందని, 24 గంటలు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు కూలడం తదితర ఇబ్బందులపై ఆమె అధికారులతో మాట్లాడారు. జోనల్ సర్కిల్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తరచుగా నీరు నిలిచే ప్రాంతాల్లో 238 స్టాటిక్ బృందాలు రోజంతా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.

News July 21, 2024

HYD: రూ.5కే టిఫిన్..!

image

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

News July 21, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్ సాగర్

image

నగరంలో కురుస్తోన్న ఎడతెరిపిలేని వానతో హుస్సేన్ సాగర్‌కు అన్ని వైపుల నుంచి శనివారం వరద పెరిగింది. 1,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, మత్తడి నుంచి 998 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నట్లు GHMC తెలిపింది. భారీగా దిగువకు దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514.75 మీ కాగా, సాయంత్రం 6 గంటల సమయానికి 513.23 మీ నీటిమట్టం నమోదైందని అధికారులు తెలిపారు.

News July 21, 2024

HYD: భార్య, కుమార్తెను చంపి సూసైడ్

image

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News July 21, 2024

HYD: ఉజ్జయిని మహంకాళి అరుదైన ఫొటో

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి‌ అమ్మవారి ఆషాఢమాస బోనాలు‌ అంగరంగ వైభవంగా‌ జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము‌ నుంచే మహిళలు‌ బోనాలతో‌ ఆలయానికి చేరుకుంటున్నారు. తల్లి దర్శనం కోసం సాధారణ భక్తులు క్యూ కట్టారు. మోండా మార్కెట్‌ నుంచి‌ మహంకాళి‌ టెంపుల్‌ వరకు అంతా సందడి‌గా మారింది. ఇటువంటి పర్వదినం రోజున 1850 నాటి అమ్మవారి అరుదైన ఫొటో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.