India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.

HYD మీరాలం చెరువుపై చింతల్ మెట్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే రోడ్డు వరకు 2.5KM వంతెన నిర్మాణంలో ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉంది. ప్రైవేటు భూములకు పూర్తిగా TDR జారీ చేసేందుకు HMDA అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు TDR జారీ చేయనున్నారు.

HYD గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 3కే, 5కే, 10కే పింక్ పవర్ రన్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్ పవర్ రన్ నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి HYD సనత్‌నగర్‌లో కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20కి పైగా పుస్తకాలు రాసి,ఎన్నో పురస్కారాలు పొందారు.ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి నేడు అందించనున్నారు.

PDSU స్వర్ణోత్సవాల మహా సభను ఈ నెల 30న ఓయూలో నిర్వహించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య వక్తలుగా ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జీబీ కోల్సేపాటిల్ హాజరవుతారని పేర్కొన్నారు.

HYDRAA కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో 1879లో రూపొందించిన హైదరాబాద్ సరస్సుల చారిత్రక చిత్రాలు వైరల్ అయ్యాయి. పరిశోధకుడు అసిఫ్ అలీ ఖాన్ ఈ చిత్రాలను పంచుకుని నగరానికి చెందిన పూర్వ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. హుస్సేన్ సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్ నగర్ సరస్సులపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కలుషితమైన ఈ సరస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే నెల 1 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.

తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే ఏపీ మాజీ సీఎం జగన్ దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు, జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే లడ్డు అపవిత్రత అయిందని అనిపిస్తుందన్నారు.హిందూ మతంపై దాడి జరిగినప్పుడు కేవలం RSS, VHP లాంటి సంస్థలే పోరాడుతాయని ఊరుకుంటే సరిపోదని, ప్రతి ఒక్క హిందువు కొట్లాడాలన్నారు.
Sorry, no posts matched your criteria.