RangaReddy

News May 16, 2024

HYD: నిబంధనలు పాటించని బడి బస్సులను సీజ్‌ చేస్తాం: ఆర్టీఏ

image

జూన్‌ ప్రారంభంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు బస్సుల ఫిట్‌నెస్‌పై యాజమాన్యాలకు పలు సూచనలు చేస్తున్నారు. గ్రేటర్‌ HYD పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

News May 16, 2024

HYD: మరో రెండు గంటల్లో వర్షం పడే ఛాన్స్!

image

HYD నగరంలోని పలు చోట్ల మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మెన్ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు మేఘావృతమై ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల బెల్ట్ ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమైనట్లు పేర్కొంది. HYD నగరంలో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

News May 16, 2024

HYD: ఐటీ ఉద్యోగులపైనే BJP ఆశలు!

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, RJNR, మహేశ్వరం ఓటర్ల పైనే BJP ఆశలు పెట్టుకుంది. కాగా ఆయా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం BJP అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు VKB, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో BRS ఓట్లు డైవర్షన్ అయినట్లు చర్చ సాగుతోంది.

News May 16, 2024

HYD: మూసీ పొడవున ప్రతి నెల నీటి పరీక్షలు!

image

HYD కాలుష్య నియంత్రణ మండలి ప్రతి నెల గండిపేట్, ముసారాంబాగ్, నాగోల్, ఫిర్జాదిగూడ, ప్రతాప సింగారం వరకు మూసీ నదిలో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్టీడబ్ల్యూఎంఎస్ ద్వారా నీటిలోని ఆక్సిజన్, అమ్మోనియా, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), నైట్రేట్, ఫ్లోరైడ్, పీహెచ్ తదితర పరిమాణాలను లెక్కిస్తున్నారు. కానీ వాటి వివరాలు అధికారులు వెల్లడించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

News May 16, 2024

సీఎం క్యాంప్ ఆఫీస్‌గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్

image

రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సమావేశాలకు ఇబ్బందికరంగా మారడంతో ‘లేక్ వ్యూ’ని వాడాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న భవనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు.

News May 16, 2024

HYD: రైల్వేస్టేషన్ నుంచి మెట్రో, ఆర్టీసీ అనుసంధానం!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి సామగ్రితో మెట్రో స్టేషన్‌కు వెళ్లడం గగనంగా మారింది. కానీ ఇప్పుడు.. ప్రతి ప్లాట్‌ ఫారం నుంచి సులభంగా మెట్రో స్టేషన్ చేరుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లకు కూడా నేరుగా స్టేషన్ నుంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఇరువైపులా ప్రజలు తిరిగేలా 12 మీటర్ల వెడల్పుతో పాదచారుల వంతెన అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

News May 16, 2024

18 నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు

image

జీహెచ్‌ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే రిలీజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

News May 16, 2024

REWIND-2019: హైదరాబాద్‌లో BJP ఓటమి!

image

HYD లోక్‌సభ‌పై అందరి దృష్టి పడింది. దశాబ్దాలుగా‌ ఇక్కడ MIM‌దే హవా. 2019‌ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్ అయింది. భగవంతరావు(BJP)పై అసదుద్దీన్(MIM) 2,82,186 ఓట్ల భారీ మెజార్టీతో‌ గెలుపొందారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికల‌కు ముందు MIM, BJP, INC, BRS నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే గెలుపు అంటున్నారు. ఈసారి HYDలో టగ్ ఆఫ్ వార్‌ అని‌ టాక్. దీనిపై మీకామెంట్?

News May 16, 2024

HYD: వ్యాస రచన పోటీల్లో పాల్గొనండి..!

image

HYD కొంపల్లి సమీపంలోని దూలపల్లి ICFRE సెంట్రల్ ఫారెస్ట్ విద్యాసంస్థలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవంలో భాగంగా వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మే 20వ తేదీన కాంటెస్ట్ ఉంటుందని, ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రథమ స్థానంలోని ముగ్గురికి సర్టిఫికెట్ అందించడంతోపాటు, వారి పేర్లను విద్యాసంస్థ బోర్డుపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.

News May 15, 2024

HYD: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: R.కృష్ణయ్య

image

తెలంగాణలో బీసీ కులగణన చేసి పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.