India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైక్‌పై ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తయిన రోడ్డు మార్గంలో ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకుని తిరిగొచ్చిన HYD మహిళా రైడర్ హారికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే వివేక్‌ను హారిక కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగుల ఎత్తు)ను చేరుకున్న తెలంగాణ తొలి మహిళగా హారిక నిలిచి, ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం అభినందనీయమన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 అర్జీలు, ఫోన్ ద్వారా మరో 8 విన్నపాలు వచ్చాయని పరిపాలన విభాగం అదనపు కమిషనర్ నళిని పద్మావతి తెలిపారు. ఆరు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 102 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించారని, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఓ యువతి వద్ద రూ.11.21 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ యువతికి ‘కాయిన్ సీఎక్స్’ కంపెనీ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో వీడియోలకు లైక్‌లు కొట్టి పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఉంది. మొదటగా 3 టాస్కులు చేసి పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.11.21 లక్షలు పెట్టుబడి పెట్టింది. విత్ డ్రా కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళపై <<13630752>>అత్యాచారానికి <<>>పాల్పడ్డ ఘటనలో అల్వాల్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆటోలో వెళ్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను ముగ్గురు కారులో తిప్పుతూ చిత్రహింస పెట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అల్వాల్ పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పుట్టింటికి వెళ్లిన భార్య రావడం లేదని మనస్తాపానికి గురైన కూలీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. సికింద్రాబాద్ దూద్‌బావికి చెందిన కూలీ గణేష్ (31) భార్య పుట్టింటి నుంచి రావడం లేదని ఆదివారం రాత్రి సీతాఫల్మండి స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోర్టు విడాకులు మంజూరు చేశాక.. తిరిగి ఆయనే భర్తగా కావాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించిన ఘటన శంషాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాల్‌దర్వాజకు చెందన సిద్ధార్థ్, కవితల పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి. వారిద్దరు కోర్టును ఆశ్రయించగా విడాకులు మంజూరు చేసింది. దీని తర్వాత సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మళ్లీ ఆయనే కావాలని ఇటీవల పోలీసులను ఆశ్రయించారు ఆ మహిళ.
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్లో 16, HYD సార్టింగ్ డివిజన్లో 12, HYD సౌత్ ఈస్ట్ డివిజన్లో 25, సికింద్రాబాద్ డివిజన్లో 62 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT
స్వచ్ఛ ఆటోల పనితీరుపై దృష్టి పెట్టాలని ZCలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఎంటమాలజి చీఫ్‌లతో ఆమె సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆటో సిబ్బంది హాజరును పర్యవేక్షించాలన్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలు రాత్రిపూట మాత్రమే చెత్త సేకరించేలా చూడాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద పెద్ద సంపుల నిర్మాణానికి టెండర్లు పిలవాలన్నారు.
గచ్చిబౌలిలోని DLF బిల్డింగ్ గేట్ నంనంబర్-3 వద్ద గోల్కొండ చెఫ్స్ పక్కన టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్లోని కిచెన్‌లో మంటల చెలరేగాయని ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కిచెన్ నుంచి అందరిని బయటికి పంపడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వారాంతంలో (శుక్ర,శనివారాల్లో) నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి 238 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. వివిధ కూడళ్లు, ప్రధాన రహదారుల్లో పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన వారిలో 184 మంది ద్విచక్ర వాహనదారులు, 13 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కారు డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.