India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే ముఖ్య సమావేశాల కారణంగా మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జీదారులంతా విషయాన్ని గమనించి బదులుగా బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.

HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.

HYD కొత్తపేటలోని మోహన్ నగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణహితంగా భారీ మట్టి గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నుంచి గణపతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 54 అడుగుల కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ శిల్పి నగేశ్ మట్టి గణపతిని రూపొందించినట్లు తెలిపారు.

HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

HYD సిటీ కమిషనరేట్ చరిత్రలో రెండు సార్లు సీపీగా బాధ్యతలు చేపట్టిన వారిలో హసన్ అలీ ఖాన్ మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత B.N. కాలియా రావు, S.P.సాతూర్, విజయ రామారావు, ప్రభాకర్ రావు, అప్పారావు, RP సింగ్ IPS ఉన్నారు. ఇదే కోవలోకి 2021లో HYD సీపీగా విధులు నిర్వర్తించిన CV ఆనంద్ రానున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో 2024లో మరోసారి HYDకి సీపీ కానున్నారు. 1945 నుంచి 4 ఏళ్లకు మించి సీపీగా ఎవరూ లేరు.

HYD సోమాజిగూడలోని రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గణేశుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణేశ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు సాదా బంకమట్టితో పర్యావరణ అనుకూలంగా తయారు చేశారు. విషరహిత కూరగాయల రంగులతో పెయింట్ వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.