RangaReddy

News July 13, 2024

HYD: అమ్మ మాట.. అంగన్వాడి బాట షెడ్యూల్..!

image

✓ జులై 15,16వ తేదీల్లో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడీల్లో చేర్చాలని కోరుతారు. ✓18న ఇంటింటికి వెళ్లి రెండున్నర ఏళ్ల చిన్నారులను గుర్తిస్తారు. ✓19న స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను శుభ్రం చేసి, మొక్కలు నాటుతారు. ✓20న ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.

News July 13, 2024

HYDలో ‘అమ్మ మాట..అంగన్వాడి బాట’

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి కేంద్రాల్లోనే జరగనుంది. జూలై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం జరగనుంది. ప్రస్తుతం రెండున్నర ఏళ్ల పిల్లలు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు, ఆట పాటలతో కూడిన విద్య అందించడమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా జిల్లాల అధికారులు తెలిపారు.

News July 13, 2024

హెచ్ఎండీఏకు త్వరలో కొత్త సిబ్బంది

image

హెచ్ఎండీఏకు జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చురుకుగా పనిచేసే కొందరు పీవోలు, ఏపీవోలు, జేపీవోలు, మిగతా సిబ్బందిని గుర్తించి వారికి హెచ్ఎండీఏలోని వివిధ జోన్లలో బాధ్యతలు కేటాయించనుంది. త్వరలో చేపట్టనున్న బదిలీల్లో ఈ నిర్ణయం తీసుకోనుంది.

News July 13, 2024

HYD: రేపు మున్నూరుకాపుల వివాహ పరిచయ వేదిక

image

మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో మున్నూరుకాపు యువతీయువకుల కోసం వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల14వ తేదీ ఆదివారం మ్యాడం అంజయ్య హాల్లో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిచయ వేదికను తెలంగాణలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 13, 2024

లష్కర్‌గూడ‌: సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి పొన్నం

image

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లష్కర్‌గూడ‌లో ఆదివారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రంగారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందులో భాగంగానే రేపు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నారు.

News July 13, 2024

HYD: ఆగస్టు 6న ఛలో పార్లమెంట్: ఆర్.కృష్ణయ్య

image

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న ఛలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ దేశంలోనే బీసీలకు అన్యాయం జరుగుతోందని, ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజార్టీ ప్రజలను అణచి వేయడం లేదని, పేరుకే ప్రజాస్వామ్యం అని, ఆచరణలో మచ్చుకైనా లేదన్నారు.

News July 13, 2024

హైదరాబాద్‌లో తగ్గిన క్రైమ్ రేట్

image

నగరంలో శాంతిభద్రతలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు పోలీస్ ‌గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023-24కి సంబంధించి తొలి ఆరు (జనవరి నుంచి జూన్) నెలల కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హత్యలు: 2023‌‌లో 47, 2024లో 45
మర్డర్‌ అటెంప్ట్‌లు: 2023లో 155, 2024లో 145
రోడ్డు ప్రమాదాలు: 2023లో 209, 2024లో 160 యాక్సిడెంట్‌ కేసులు నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
SHARE IT

News July 13, 2024

HYD: గంజాయి జాగ చెబితే రూ.2లక్షలు

image

HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్‌పై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందిస్తామని నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. 100 కిలోలకుపైగా గంజాయి నిలువలు, సరఫరా సంబంధించిన సమాచారం ఇస్తే రూ.2లక్షల రివార్డు అందిస్తామన్నారు. గంజాయి ఎక్కడుందనే సమాచారం 8712671111కు వివరాలు ఇవ్వాలన్నారు.

News July 13, 2024

HYD: త్వరలో నీలోఫర్లో గర్భిణులకు SPECIAL

image

HYDలోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు HALతో రూ.20.22 కోట్ల ఒప్పందం జరిగింది. రూ.10.20 కోట్లతో భవన నిర్మాణం, వైద్య పరికరాలకు రూ.10.02 కోట్లు ఖర్చు చేయనున్నారు. భవనం పూర్తయితే గైనిక్ ఓపి ప్రారంభమవుతుందని యాంటినెంటల్, 2D, ECHO, అల్ట్రా సౌండ్, మల్టీ పారామీటర్స్ వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని డా.ఉషారాణి తెలిపారు.

News July 13, 2024

HYDలో బీఆర్ఎస్‌ను వీడుతున్నారు!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో‌ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.‌ రాజధానిలో 18 మంది BRS MLAలు గెలిచినా.. ఇప్పటికే ముగ్గురు INCలో చేరారు. మరికొందరు‌ కూడా‌ చేరుతారని హస్తం నేతలు చెబుతున్నారు. దీనికితోడు మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌లు, కార్పొరేటర్లు క్యూ కట్టారు.‌ జిల్లా స్థాయిలో‌ కీలక నేతలు‌ జంప్‌ అవడంతో గులాబీ శ్రేణులు‌ అయోమయంలో పడుతున్నారు. శనివారం మరో BRS MLA కూడా‌ పార్టీ మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.