RangaReddy

News July 12, 2024

HYD: రూ.5,979 కోట్ల నష్టాల్లో మెట్రో

image

HYD నగరంలో 2017లో ప్రారంభమైన మెట్రో రైలులో 2024 ఫిబ్రవరి వరకు 50 కోట్ల మంది రాకపోకలు సాగించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అయితే ఆరేళ్లుగా HYD మెట్రో తీవ్ర నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. 2022 మార్చి 31 నాటికి రూ.4,108.37 కోట్ల నష్టాలు, అలాగే 2023 మార్చి 31 నాటికి రూ.5,424.37 కోట్లకు పెరిగాయని, 2024 మార్చి 31 నాటికి రూ.5,979.36 కోట్లకు చేరినట్లు స్పష్టం చేశారు.

News July 12, 2024

HYD: రేపు ఐకానిక్ బిల్డింగ్ ప్రారంభించనున్న CM

image

HYD నగరంలోని JNTUHలో రూ.36 కోట్లతో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ ఐకానిక్ భవనాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ఇన్‌ఛార్జి వీసీ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ప్రారంభోత్సవానికి అన్నింటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

News July 12, 2024

FLASH: హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు

image

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. అందులో ఒకరు గొడ్డలితో దాడి చేయబోయాడు. మరో వ్యక్తి రాళ్లు విసిరి తప్పించుకునే యత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 12, 2024

హైదరాబాద్‌లో సొరంగ మార్గం కష్టం.?

image

HYDలో టన్నెల్‌ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45, KBR పార్కు కింద నుంచి 6.30 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇందుకు రూ. 3 వేల కోట్లు అవుతుందని ఓ ఏజెన్సీ జీహెచ్ఎంసీకి నివేదిక సమర్పించింది. దీనికి తోడు జూబ్లీహిల్స్‌ రోడ్ నం. 2లో భూసేకరణ కొంత కష్టమేనని‌ అధికారులు చెబుతున్నారు. టన్నెల్ నిర్మాణంపై ముందుకు వెళుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

News July 12, 2024

తెలంగాణలో ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాల ఏర్పాటు: మంత్రి దుద్దిళ్ల

image

అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్‌వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో HYD సచివాలయంలో సమావేశమయ్యారు.

News July 11, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి:ఎంపీ ఈటల
✓రాచకొండ పోలీస్ కమిషనర్ అధికారిగా సుధీర్ బాబు
✓కొత్తపేట: ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అశోక్ సార్
✓ఖైరతాబాద్: ఈసారి 70 అడుగుల ఎత్తులో గణేశుడు
✓బోనాల ఊరేగింపు కోసం కర్ణాటక రూపవతి ఏనుగు రాక
✓మేడ్చల్:బాలిక పై అత్యాచారం..20 ఏళ్ల జైలు శిక్ష
✓కూకట్పల్లి: నకిలీ ఐఏఎస్ సందీప్ అరెస్ట్
✓GHMC:ఆగస్టు 5న స్టాండింగ్ కమిటీ ఎన్నిక

News July 11, 2024

HYD: ఇంటర్ విద్యార్థి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. RR జిల్లా నందిగామ మండల కేంద్రానికి చెందిన బన్నీ(18) ఇంట్లో ఉన్న నీటి సంపులో మోటార్ ‌కు వైర్లు బిగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. అపస్మారక స్థితిలో ఉన్న బన్నీని కుటుంబీకులు షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News July 11, 2024

HYD: బోనాలు, మొహర్రం ఊరేగింపు కోసం కర్ణాటక ఏనుగు

image

రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు, మొహర్రం పండగ సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగును రప్పించనున్నారు. కర్ణాటక దావణగెరెలోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఊరేగింపు కోసం తెలంగాణకు ఏనుగు(రూపవతి)ని తరలించేందుకు అక్కడి శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏనుగు కోసం మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

News July 11, 2024

HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. 2017లో 8 ఏళ్ల బాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానాను విధిస్తూ జడ్జి తీర్పును వెలువరించారు.

News July 11, 2024

HYDలో JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

HYD భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్‌ చూడండి. SHARE IT