India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో 2,158 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్కు 13 పరీక్ష కేంద్రాల పరిధిలో 2,965 మంది హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
మంత్రి వర్గ విస్తరణలో HYD, ఉమ్మడి RRకు చెందిన ఒక్క కాంగ్రెస్ MLAకు ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. శ్రీగణేశ్ (కంటోన్మెంట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి(పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్), ఆరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల) ఉండగా ఎవరికీ ఛాన్స్ దక్కలేదని సమాచారం.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరిరావు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో కార్పొరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, పురుషుల కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడలు విక్టరీ ప్లే గ్రౌండ్తో పాటు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. GHMC పరిధిలోని సమస్యలపై ఆమె శ్రద్ధ చూపడంలేదని కనీసం ఆమె కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండటం లేదని శ్రవణ్ ఆరోపించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, మేయర్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు.
ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కాసులాబాద్లో 37.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళ్పల్లిలో 36.6℃, హస్తినాపురం, ఎలిమినేడు 36.3, చుక్కాపూర్ 36.2, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, దండుమైలారం 35.7, చందానవెల్లి 35.4, మొగల్గిద్ద, వైట్గోల్డ్ SS 35.3, తొమ్మిదిరేకుల 35.1, అలకాపురి, గచ్చిబౌలి, మియాపూర్ 35.1, షాబాద్, కేతిరెడ్డిపల్లిలో 35℃ ఉష్ణోగ్రత నమోదైంది.
GHMC కమిషనర్ ఇలంబర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది ఇంజినీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ, అక్రమాలకు పాల్పడుతున్నవారితో చెడ్డపేరు వస్తుందని, వీరిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజినీర్లు తనిఖీలు చేయకపోవడం, చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తొలగించినట్లు తెలిపారు.
సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత చాలా తగ్గింది. వర్షం నేపథ్యంలో జిల్లాలోని చుక్కాపూర్లో 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాసులాబాద్, చందనవెల్లి 37.6, మహేశ్వరం, మొగలిగిద్ద 37.5, రెడ్డిపల్లె 37.4, ప్రొద్దుటూరు 37.3, దండుమైలారం 37.1, కేతిరెడ్డిపల్లి 37.1, మొయినాబాద్ 36.8, రాజేంద్రనగర్, శంకర్పల్లి, HYD విశ్వవిద్యాలయం 36.5, చంపాపేట్, గచ్చిబౌలి 36.4, అల్కాపురి 36.3, మంగళపల్లె 36.3℃ఉష్ణోగ్రత నమోదైంది.
Sorry, no posts matched your criteria.