RangaReddy

News July 11, 2024

HYD: ఆగస్టు 5న స్టాండింగ్ కమిటీ ఎన్నిక

image

బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 11, 2024

హైదరాబాద్‌: జూ పార్కుకు కొత్త జంతువులు

image

HYDలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు‌కు కొత్తగా జంతువులు వచ్చాయి. జంతు మార్పిడిలో భాగంగా UP కాన్పూర్‌ నుంచి రాయల్ బెంగాల్ పెద్దపులి(ఆడ)ని తీసుకొచ్చారు. మరో రెండు చిరుత పులుల జంటలు, జింకలు, కొన్ని పక్షులను‌ ‘జూ‌’కు షిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి కాన్పూర్‌కు‌ కూడా పలు జంతువులను తరలించారు. కాగా, మంగళవారం నుంచి ఆదివారం(8:30AM-4PM) వరకు జూ తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు. SHARE IT

News July 11, 2024

HYD: ‘డెంగ్యూ‌కు వ్యతిరేకంగా పోరాడుదాం’

image

డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. లిబర్టీలోని ప్రధాన కార్యాలయంలోని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వైద్యఆరోగ్యశాఖ ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రెగ్యూలర్‌గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

News July 11, 2024

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి!

image

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త. నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్‌‌మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్‌ NH-44కు అనుసంధానం చేస్తూ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో HMDA ప్లాన్‌ చేస్తోంది. మొత్తం 4 లైన్‌లు, 2.65 KM పొడవు, రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులు, ఒక చోట ఎగ్జిట్‌ ర్యాంప్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

News July 10, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓బల్కంపేట: దద్దరిల్లిన ఎల్లమ్మ తల్లి ఊరేగింపు
✓షాద్ నగర్లో వ్యక్తి దారుణ హత్య
✓HYD: సచివాలయం వద్ద విలేఖరుల నిరసన
✓దుండిగల్: మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
✓గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలని నిరసన
✓అమీర్పేట: మెట్రోలో ప్రయాణించిన ఎండి NVS రెడ్డి
✓పోచారం: ప్రాణం తీసిన బెట్టింగ్

News July 10, 2024

HYD: బెట్టింగ్‌ తీసిన ప్రాణం

image

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్‌ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండలో ఉంటున్న పేరెంట్స్ వద్ద కాలేజీ ఫీజు కోసం అని రూ. 1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌‌లో పొగొట్టాడు. కష్టం చేసి తెచ్చిన డబ్బు వృథా చేశావని పేరెంట్స్ మందలించడంతో‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 10, 2024

HYD: మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

HYD మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. యూనివర్సిటీలో అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్న హరినాథ్ పురుగుమందు తాగాడు. అనంతరం వసతి గృహం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2024

HYD: కాంగ్రెస్ ప్రభుత్వానికి KTR Request

image

HYD శివారులోని కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణ పనులు కొనసాగించాలని KTR తెలంగాణ CMOని కోరారు. 125 ఎకరాల్లో అద్భుతమైన ఎకో పార్క్‌ ప్రాజెక్టును 2022 అక్టోబర్‌లో ప్రారంభించామన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న చివరిరోజు వరకు పనులు కొనసాగించామన్నారు. కానీ, గత 7 నెలలుగా ప్రాజెక్టు ముందుకు కదలలేదని‌ పేర్కొన్నారు. నగరవాసులకు అహ్లాదాన్ని పంచే‌ పార్క్‌ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

News July 10, 2024

HYD: గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దు: చనగాని

image

గ్రూప్-2 అభ్యర్థులు తొందర పడొద్దని, CM రేవంత్ సానుకూలంగా ఉన్నారని TPCC అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ప్రిపరేషన్‌కు సిద్ధం కావాలని చనగాని దయాకర్ సూచించారు. DSC పరీక్ష వాయిదా ఉండదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తారని వెల్లడించారు.

News July 10, 2024

భార్యపై అనుమానం.. మల్కాజిగిరిలో మర్డర్

image

అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన రాజేందర్‌(45), కృష్ణకుమారి(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా‌ పని చేస్తున్న ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి‌ గొడవ పడి‌ విచక్షణ రహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక కృష్ణకుమారి గదిలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.