India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక్క క్లిక్ చేస్తే విద్యా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని HYD లైబ్రరీ అధికారులు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కేజీ నుంచి పీజీ విద్యార్థుల పుస్తకాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (https://ndl.iitkgp.ac.in) వెబ్‌సైట్‌లో లభిస్తాయి. నీట్, జేఈఈ, యూజీసీ నెట్, గేట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల మెటీరియల్స్ ఉన్నాయి.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, చాయ్ బండ్లు, పానీపూరి బండ్లలో పాడైన ఆహారాన్ని విక్రయించడం, బిర్యానీలో బొద్దింక, పూరిలో గుండు పిన్ను లాంటివి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తే వాట్సాప్ నం. 9100105795, 040-21111111, మెయిల్, ‘X’లో తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
SHARE IT
ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ల జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో ఇద్దరు వికారాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా.. ముగ్గురు రంగారెడ్డి జిల్లా వారున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. తొలి విడతలో పదవులు దక్కని వారంతా రెండో జాబితాలోనైనా తన పేరు వస్తుందని ఆశతో ఉన్నారు.
✓గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది.
✓పొత్తి కడుపులో నొప్పి.. తరచూ కడుపు ఉబ్బరం
✓పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తారు.ఆ సమయంలో మంట, నొప్పిగా అనిపిస్తుంది
✓శృంగారంలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత యోని దగ్గర నొప్పి, మంటగా ఉంటుంది
✓దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది
✓అలసట, నీరసం, బరువు తగ్గడం, రక్తహీనత కనిపిస్తాయి
•పై లక్షణాలు ఉంటాయని HYD MNJ డా. నాగశ్రీ తెలిపారు.
HYD శివారు మొయినాబాద్‌లో గల ఓ ఫామ్ హౌస్‌లో నలుగురు యువతులు, ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సురంగల్ గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్‌లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ పేరుతో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి నలుగురు అమ్మాయిలను తీసుకువచ్చినట్లు సమాచారం.
GHMC పరిధిలో ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 30.81 లక్షల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది వరకు హరితహారం పేరిట జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని పేరును వనమహోత్సవంగా మార్చింది. అయితే బెల్టోపారం, గుల్మోహార్ వంటి వాటితో పాటు ఈసారి కానుగ, వేప, రావి వంటివి సైతం నాటనున్నారు.
వ్యాపారం కోసం తల్లిని డబ్బులు అడగగా.. తన వద్ద లేవని చెప్పడంతో మనస్తాపానికి గురైన కొడుకు తన ఫోన్ స్టేటస్‌లో ‘ఇది నా చివరి రోజు’ అని పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మిర్జాలగూడలో నివాసముండే లలిత కుమార్ వాసు(25) టిఫిన్ బండి పెట్టుకోవడానికి రూ.5 లక్షలు కావాలని తల్లిని అడిగాడు. ఇవ్వక పోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
HYD నాగోల్ పరిధి సాయి నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. నల్గొండ జిల్లాకు చెందిన నరేశ్ (35) కొంతకాలంగా హైబీపీతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం అతడు ఉండే గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డోర్ తెరిచి చూడగా.. నరేశ్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం సాయంత్రం అమ్మవారిని పెళ్లికూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి పెద్ద ఎత్తున ఒగ్గు కళాకారులు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు.
✓రామంతపూర్:వన మహోత్సవం ప్రారంభించిన మంత్రులు
✓మేడ్చల్: డ్రగ్స్ తీసుకున్న 12 మంది పై కేసు నమోదు
✓కంటోన్మెంట్ GHMCలో కలిస్తే నష్టమే:రామకృష్ణ
✓గచ్చిబౌలి: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
✓HYD: 7 నెలల్లో పింఛన్ అందింది రెండుసార్లే!: బిక్షపతి
✓HYD: నిరుద్యోగుల కన్నెర్ర.. చీకట్లోనూ నిరసనలు
✓గోల్కొండ: రెండవ రోజు కొనసాగిన బోనాలు
Sorry, no posts matched your criteria.