RangaReddy

News July 8, 2024

HYD: డ్రగ్స్ సేవించిన 12 మందిపై కేసు 

image

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన పోలీసులు చర్యలుంటాయన్నారు.

News July 8, 2024

గచ్చిబౌలి: స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో పాల్గొన్న సీఎం

image

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాలేజీలో నిర్మాణమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు.

News July 8, 2024

HYD: ప్లాస్టిక్ సర్జరీలపై ప్రత్యేక సేవలు: డా.లక్ష్మీ

image

ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.

News July 8, 2024

HYD: శిథిలావస్థలోని భవనాలపై చర్యలేవి!

image

గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్‌పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.

News July 8, 2024

HYD నుంచి స్వర్ణగిరికి వెళ్లే బస్సుల TIMINGS ఇవే..!

image

HYD నుంచి యాదాద్రి సమీపంలోని స్వర్ణగిరి టెంపుల్‌కి రెండు ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్, నాన్ ఏసీ బస్సులను RTC నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు బస్ టైమింగ్స్ విడుదల చేశారు. సికింద్రాబాద్ JBS నుంచి ఉ.7, 8, మ.2.50, 3.50 గంటలకు బయలుదేరుతాయని, తిరిగి స్వర్ణగిరి నుంచి JBSకు మ.12.10, 1.10, రా.8, 9 గంటలకు బస్సులుంటాయన్నారు. JBS నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.80 టికెట్ ధరగా నిర్ణయించారు.

News July 8, 2024

HYD: MNJ క్యాన్సర్ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి

image

HYD నగరంలోని రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి పెరిగింది. నిత్యం ఓపీలు 600-700 నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 350-400 మందికి కీమోథెరపీ, 200-250 మందికి రేడియో థెరపీ చేస్తున్నట్లు వివరించారు. ఏటా రోగులు గణనీయంగా 20% పెరుగుతున్నారని పేర్కొన్నారు.

News July 8, 2024

HYD: మాదాపూర్ డీసీపీ స్ట్రాంగ్ WARNING

image

యువతీయువకులు డ్రగ్స్ తీసుకున్నా,వారి కోసం పబ్‌లు పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని HYD మాదాపూర్ DCP వినీత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్‌లలో తనిఖీలు చేసేటప్పుడు అక్కడికక్కడే యూరిన్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పాజిటివ్‌గా తేలితే సంబంధిత వ్యక్తులపై NDPSయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా,వాడినా 8712671111 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

News July 8, 2024

HYD: గోల్కొండ జాతర.. కిక్కిరిసిన బస్సులు..!

image

HYD గోల్కొండ జాతరను వీక్షించేందుకు ఈరోజు ఉదయం నుంచే సికింద్రాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, జవహర్‌నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సహా సెట్ విన్ బస్సుల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. లక్షల మంది రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 

News July 8, 2024

HYD: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!

image

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 8, 2024

HYD: నేడు వనమహోత్సవం ప్రారంభం

image

హైదరాబాద్‌లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నేడు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఉప్పల్ సర్కిల్-2, హబ్సిగూడ సర్కిల్- 8, రామంతాపూర్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.