India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు కుటుంబాలను చిదిమేస్తున్న ఘటనలు HYDలో పెరుగుతున్నాయి. జీడిమెట్ల పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో నష్టపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పటాన్‌చెరులోని రుద్రారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది.

మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

విద్యుత్తు వ్యవస్థను పర్యవేక్షించే ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయాన్ని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్ రాస్, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీ డీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదివారం సందర్శించారు. విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదులు స్వీకరించే 1912 కాల్ సెంటర్ వ్యవస్థను పరిశీలించారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు.

గ్రేటర్లో అత్యవసర పనులు తప్ప కొద్ది నెలలుగా ఇతర అభివృద్ధి జరగట్లేదు. కాలనీ రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా చాలా పనులు ఆటకెక్కాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. నాలాల పూడికతీత, నిర్మాణ పనులు సవ్యంగా జరగకపోవడంతో వర్షాకాలం ముంపు తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి వేర్వేరు రూపాల్లో రూ.8వేల కోట్లు రావాలి.

HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

HYDలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టిన పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, SPలతో ఆదివారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, DGP జితేందర్‌లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను 5వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

గ్రేటర్ HYD పరిధిలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుంది. జులై నాటికి ఏకంగా గ్రేటర్ రోడ్ల పై 81.21 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,103 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా.. వాహనాల పెరుగుదలకు తగ్గట్లు రోడ్ల వ్యవస్థ సరిగ్గా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీసులు, వికారాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా తీసుకుంటున్న సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

HYD నగరంలో వర్ష బీభత్సానికి పలుచోట్ల పాములు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓల్డ్ సిటీ హసన్ నగర్ ప్రాంతంలో పైతాన్ రాగా.. స్నేక్ క్యాచర్ హకీం షాకిల్ అప్రమత్తమై, పామును పట్టుకున్నారు. పాములు, మొసళ్లు కనిపిస్తే..TFD 18004255364, ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ 8374233366, అనిమల్ వారియర్స్ 9697887888ను సంప్రదించండి.
Sorry, no posts matched your criteria.