India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD,RR,MDCL,VKB జిల్లాలలో వర్షం దంచికొట్టింది. 24 గంటల్లో అత్యధికంగా RR జిల్లా కేశంపేటలో 208.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..తలకొండపల్లి-146.5, నందిగామ-137, మేడ్చల్ జిల్లాలో కీసర-105.8, సింగపూర్ టౌన్షిప్-81, HYD జిల్లా యూసఫ్ గూడ-74.8, షేక్ పేట-72.8, VKB జిల్లాలో యలాల్-128.8, కుల్కచర్ల-125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షం దాటికీ లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

HYD జీడిమెట్ల పీఎస్ పరిధి గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్(40), వర్షిణి(33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జీడిమెట్ల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మూసివెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత అంత ఈజీ కాదని, HMDA, GHMC, రెవెన్యూ అధికారులకు కష్టం అవుతుందని భావిస్తున్న యంత్రాంగం, హైడ్రాకు అప్పగించడంపై సమాలోచన చేస్తుంది. మూసి సర్వేలో 12 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెళ్లడైంది. ఇప్పటికే లంగర్‌హౌస్ నుంచి నాగోల్ వరకు సుమారు 5,501 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కూల్చివేతలో పునరావాసం కోసం బాధితులకు రూ.2,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం GHMC కమిషనర్ ఆమ్రపాలి, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవలకై 040-21111111, 9000113667 నంబర్లలకు సంప్రదించాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆద్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆలు చిప్స్, చెకోడీలు, మురుకులు, మిక్చర్, బెల్లం చెక్కీల తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్, అత్తాపూర్, నాగోల్ లాంటి ప్రాంతాల్లో అధికారులు కనీసం తనిఖీలు చేపట్టకపోవడంతో కల్తీ దందా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని జీహెచ్ఎంసీకి పలువురు ఫిర్యాదు చేశారు.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని వెంకటాపూర్ నాదం చెరువు తూమును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీళ్లు దిగువకు పోటెత్తాయి. నాదం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుపై ఇటీవల పోచారం పీఎస్‌లో కేసు నమోదైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఏఈఈకి ఫిర్యాదు చేశారు.

తెలంగాణలోని RR, HYD, MDCL జిల్లాలు 2022-23 జీడీపీలో ముందంజలో నిలిచాయి. RR జిల్లా GDP రూ.2,83,419 కోట్లు, HYD- రూ.2,28,623 కోట్లు, మేడ్చల్-రూ.88,867 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో, వికారాబాద్-రూ.19,840 కోట్లతో 21వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే చివరి స్థానంలో ములుగు జిల్లా ఉన్నట్లుగా తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

RRR 189.2 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్మెంట్ డిజైన్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఫోర్త్ సిటీ, ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే లాంటివి దక్షిణ భాగాన ఉన్నందున అన్ని కలిసోచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారులు ఆచితూచి అడుగులు వేస్తూ అలైన్మెంట్ కోసం మూడు డిజైన్లు రూపొందిస్తున్నారు. సుమారు రూ.16 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం జరగనుండగా, భూ పరిహారానికే రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.