India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 7న ప్రారంభం కానున్న గోల్కొండ కోట జగదాంబికా మహంకాళి బోనాలకు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రానున్నారని భాగ్యనగర్ బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భగవంత్ రావు తెలిపారు. బోనాల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. ఖైరతాబాద్‌లోని తన ఛాంబర్‌లో ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లతో వీధి దీపాల నిర్వహణపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని, వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిటీలో డార్క్ స్పాట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నగరాభివృద్ధి, నిర్వహణ పనులు, ప్రజా సమస్యలపై శనివారం హైదరాబాద్ నగర పాలక సంస్థ(GHMC) పాలకమండలి ఖైరతాబాద్‌లోని బల్దియా హెడ్ ఆఫీస్‌లో సమావేశం కానుంది. అందుకు సంబంధించి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై BRS, కాంగ్రెస్ నేతలు శుక్రవారం పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. BRS కార్పొరేటర్లతో మాజీ మంత్రి తలసాని, ఇతరులు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాల డిమాండ్‌కు వారు తీర్మానించారు.
సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తోన్న భూమి శుక్రవారం అత్యంత దూరంగా వెళ్లిందని HYDలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు, అంతరిక్ష పరిశోధన నిపుణులు N.శ్రీరఘునందన్ తెలిపారు.HYDలో ఆయన మాట్లాడుతూ.. సూర్యుడికి దగ్గరగా ఉన్న రోజు (JAN 3, 2024)తో పోలిస్తే 50 లక్షల కిలో మీటర్ల దూరంగా ఉందన్నారు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటే వేడి ఎక్కువ ఉంటుందనే భావన ఉందని, ఇందుకు విరుద్ధంగా JANలో ఉందన్నారు.
నగరంలో లింగప్ప అనే పారా అథ్లెట్ రెండు చేతులు లేకున్నా సత్తా చాటాడు. తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పోటీలో ఏకంగా బంగారు పతకం సాధించాడు. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూర్‌లో జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు RR జిల్లా అథ్లెటిక్స్ కోచ్ సాయి రెడ్డి తెలిపారు. నిరుపేద అయిన లింగప్ప టాలెంట్ ముందుకు వెళ్లాలంటే సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోచ్ పిలుపునిచ్చారు.
చెరువుల రక్షణ, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. HYD జిల్లా పరిధిలో 28, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1078, మేడ్చల్ జిల్లాలో 620, మెదక్ జిల్లాలో 589, సంగారెడ్డి జిల్లాలో 603, సిద్దిపేట 347, యాదాద్రి భువనగిరి జిల్లాలో 267 చెరువులు ఉన్నాయి. చెరువులను అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు చేస్తున్నట్లుగా తెలిపింది.
ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా విస్తరించటంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కోకాపేటలో 220/132/33KV సామర్థ్యం కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(GISS) నిర్మించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిని ఏకంగా రూ.498 కోట్లతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్ కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎండీ రజ్వి తెలిపారు.
HMDA పరిధి జవహర్‌నగర్‌లో 2000 ఎకరాలకు పైగా, మియాపూర్‌లో 445 ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్, శంషాబాద్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, మూసాపేట, సరూర్‌నగర్, బాటసింగారం, మంగళపల్లి, తుర్కయంజాల్, తొర్రూరు, మేడిపల్లి, షాబాద్, బహదూర్‌పల్లి, బాచుపల్లి, కోహెడ, పెద్ద అంబర్‌పేట, కుర్మాల్‌గూడ, తెల్లాపూర్, పటాన్‌చెరు, కందిలోనూ HMDA భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రేపటి నుంచి లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమవుతుందని ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం పలు విషయాలు వెల్లడించారు. జులై 7న ఘటోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 21న సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఉ. 3:30కి CM రేవంత్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారన్నారు. 22న రగం(భవిష్యవాణి) ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
HMDA భూములకు సంబంధించి GIS డిజిటల్ మ్యాపింగ్ చేసే ప్రక్రియ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొబైల్‌లో యాప్ ఓపెన్ చేస్తే చాలు అరచేతిలో భూముల వివరాలు, హద్దులతో సహా కనిపించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. HMDAకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260 ఎకరాలను కేటాయించింది. నగర శివారు జిల్లాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.