RangaReddy

News July 6, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓బేగంపేటలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం✓HYDలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ రోడ్‌ షో ✓నాగోల్: మతిస్థిమితం లేని MBBS యువతి ఆత్మహత్య  ✓కోఠి: గంజాయి కేసులో జూనియర్ డాక్టర్లు అరెస్ట్  ✓నాంపల్లి:HYD నగరంలో నిరుద్యోగుల ఆందోళనలు  ✓HYD: నిరుద్యోగుల ధర్నా.. బర్రెలక్క(శిరీష) అరెస్టు ✓కోకాపేట: కొనసాగుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పనులు 

News July 5, 2024

హైదరాబాద్‌లో వాచ్‌మెన్ దారుణ హత్య

image

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వాచ్​మెన్​ దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలగూడ CI అనుదీప్​ కథనం ప్రకారం.. ఉప్పరిబస్తీలో నిర్మాణంలో ఉన్న భవనంలో కుమ్మరి రామచంద్రయ్య (40) వాచ్​మెన్‌గా పనిచేస్తున్నాడు. రాళ్ల పనిచేసే సలీమ్​‌తో కలిసి నిన్న రాత్రి 10 గంటలకు మద్యం సేవించారు. మద్యం మత్తులో గొడవ జరిగింది. క్షణికావేశంలో సలీమ్​ రామచంద్రయ్యను ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై రామచంద్రయ్య చనిపోయాడు.

News July 5, 2024

HYD: ICAR ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాలు!

image

HYD నగర శివారు రాజేంద్రనగర్ ICAR ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సంస్థలో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఉండగా.. జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ ఉన్నట్లు పేర్కొన్నారు. జులై 8 దరఖాస్తుకు చివరి తేదీగా అధికారులు తెలిపారు. వెబ్ సైట్ https://icar-iior.org.in ద్వారా మిగతా వివరాలు పొంది, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

HYD: బస్సులో మహిళ ప్రసవం.. అభినందించిన ఎండీ సజ్జనార్

image

ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డ్రైవర్, కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం అభినందనీయమన్నారు.

News July 5, 2024

WOW.. HYD నగరంలో హెరిటేజ్ అందాలు!

image

HYD నగరం హెరిటేజ్ అందాలకు మారుపేరుగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి HYD నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోకాపేటలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 120 మీటర్ల ఎత్తులో ఈ హెరిటేజ్ టవర్ ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.

News July 5, 2024

HYD: 8వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

image

MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్‌కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.

News July 5, 2024

HWO పరీక్షకు 56.92 శాతం మంది హాజరు

image

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (HWO) పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు TGPSC అధికారులు పేర్కొన్నారు. పేపర్-1కు 56.94% మంది, పేపర్-2కు 56.04% మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

News July 5, 2024

HYD: జూలై 7 నుంచి MMTS సేవల పునరుద్ధరణ!

image

HYD నగరంలో జులై 6 వరకు పలు MMTS రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. జులై 7 నుంచి సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ లింగంపల్లి (47222), లింగంపల్లి మేడ్చల్(47225), మేడ్చల్ సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్ మేడ్చల్ (47236), మేడ్చల్ సికింద్రాబాద్ (47237) సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 5, 2024

HYD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకట్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. అత్తాపూర్ PS పరిధిలో నివసించే ఓ బాలిక ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు గురువారం అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది.

News July 5, 2024

గ్రేటర్ HYDలో ఆస్తి పన్ను పరిస్థితిపై FOCUS!

image

గ్రేటర్ HYD ఆస్తిపన్ను పరిధిలో భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20 వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ.1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ.2500 కోట్ల మేర రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పలు సమస్యలు తీర్చి, ఆస్తి పన్నును పకడ్బందీగా వసూలు చేసే విధానం పై కసరత్తు చేస్తున్నారు.