India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీ.. బాలానగర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. వర్సిటీతో పాటు.. ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యాశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జులై 31 వరకు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. గురువారం బంజారాహిల్స్‌లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి యాంటీ డ్రగ్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ విడుదల చేశారు. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కు డ్రగ్స్ వినియోగం, దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. న్యూ మల్లేపల్లి, గోకుల్‌నగర్‌కు చెందిన టి.మనోహర్(33) కుటుంబ సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌కు లోనయ్యాడు. నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. ఉదయం హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదిక పంపాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో ZCలతో సమావేశమయ్యారు. డెంగ్యూ నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి శుక్రవారం Dry Day, ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జోన్‌ల వారీగా టాక్స్ వసూలు చేసిన శాతం ప్రకారం నిధులు మంజూరు అవుతాయన్నారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకొని పోలీసులకు సహకారం అందించాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు, మొహర్రం సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీజీఎస్, సీసీ మీడియా బ్రీఫింగ్ హాల్లో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోనాల జాతర ఉత్సవాలు, మొహర్రం సందర్భంగా నగరంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
చండీగఢ్, పంజాబ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరు యువకులను HYD ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్ వాసి కృష్ణ మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కంపెనీలో నెలకు రూ.70 వేలు జీతం ఇప్పిస్తానని చెప్పి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లాక రూమ్‌లో బంధించి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.
HYD నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ రూమ్‌లో వసూళ్లపై SCR ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి నుంచి క్లాక్ రూమ్ వద్ద ఒక బ్యాగుకి 24 గంటలకి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.40 వసూలు చేశారని, ఇలా వందలాది మంది నుంచి అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిల్ కండిషన్లలోనూ 24 గంటలకు రూ.20 వసూలు చేయాలని ఉందని చూపించారు.
నగర పరిసరాల నుంచి భారీ మొత్తంలో నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి HYD హైటెక్ సిటీలో అక్రమంగా డంప్ చేస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా అందరి కళ్ల ఎదుట జరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరవయ్యారని పేర్కొన్నారు. HYDలో నిర్మాణ వ్యర్థాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయని, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నగర ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
HYD మియాపూర్ పీఎస్ పరిధిలో హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హఫీజ్‌పేట్ లక్కీ హుక్కా సెంటర్‌లో పోలీసులు ఈరోజు తనిఖీ చేశారు. నిషేధిత హుక్కా ఫ్లేవర్లు అమ్ముతున్నట్లు గుర్తించి సెంటర్ యజమానిని అరెస్ట్ చేశారు. 250కి పైగా హుక్కా ఫ్లేవర్లు, 150కి పైగా హుక్కా పైపులను సీజ్ చేశారు.
మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంగళరావునగర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థలో దేవేందర్ యాదవ్(55)తోపాటు మరో మహిళ(45) ఉద్యోగం చేస్తోంది. మహిళకు సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను దేవేందర్ యాదవ్ తన సెల్‌ఫోన్‌లో తీసి పెట్టుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె ఉద్యోగం మానేసింది. దీంతో దేవేందర్ ఆమెకు ఫోన్ చేసి కోరిక తీర్చాలని వేధించగా.. జూబ్లీహిల్స్ PSలో ఆమె ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.