RangaReddy

News September 6, 2024

HYD నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం.. జాగ్రత్త!

image

నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. నారాయణగూడ IPM బృందం 4 కేసుల్ని నిర్ధారించింది. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న పశ్చిమబెంగాల్‌కి చెందిన వ్యక్తికి, టోలీచౌకికి చెందిన మరో వృద్ధుడు, హైదర్‌నగర్‌కు చెందిన మహిళ, జార్ఖండ్ నుంచి HYD వచ్చిన ఓ మహిళకు ఫ్లూ సోకినట్లు తేల్చింది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.

News September 5, 2024

HYD: ఇబ్రహీంపట్నంలో ముగ్గురు ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెద్ద చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హస్తినాపురానికి చెందిన మంగ కుమారి(తల్లి), శరత్(కుమారుడు), లావణ్య(కూతురు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

News September 5, 2024

మా ప్రదీప్ సార్ ఎప్పటికీ ప్రత్యేకమే: HYD కలెక్టర్

image

ఆరో తరగతిలో ఆంగ్లం బోధించే ప్రదీప్ మాస్టారు పాఠాలు చెప్పే విధానం నచ్చేదని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. ఈ మేరకు గురువుల దినోత్సవం సందర్భంగా ఆయన పంచుకున్నారు. ‘మాస్టారు అందరూ ఇంగ్లిషులో మాట్లాడేందుకు ప్రోత్సహించారు. అప్పటినుంచి ఆంగ్ల భాషపై పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాను. పదో తరగతి వచ్చేసరికి ఆంగ్లభాషలో మాట్లాడే స్థితికి చేరుకున్నా’ అని తెలిపారు.

News September 5, 2024

ఖైరతాబాద్: డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యులు ఉన్నారు.

News September 5, 2024

ఆవిష్కరణలకు HYD కేంద్రంగా మారింది: జయేష్

image

HYD సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ISB సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. టీ హబ్‌లో అనేక అంకురాలు మొగ్గ తొడిగి పెద్ద సంస్థలుగా విస్తరించినట్లు తెలిపారు. నూతన ఆలోచనలతో వేలాదిమందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

News September 5, 2024

రంగారెడ్డి: అమ్మే తొలి గురువు: కలెక్టర్ శశాంక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లే తొలి గురువుగా పేర్కొన్నారు. ప్రాథమిక, హై స్కూల్ దశలో మాధవి, జయంత్‌నాథ్, సోమయాజులు, లక్ష్మణరావుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. జూనియర్ కాలేజీలో మంజుసూరి, బీకాం చదివేటప్పుడు రఘువీర్ సార్లు ప్రతి అంశంలోనూ అవగాహన కల్పించే వారన్నారు. వారి ప్రేరణతోనే సివిల్స్ వైపు అడుగేసి విజయం సాధించానని వివరించారు. 

News September 5, 2024

HYD: కలుషిత నీటి సమస్యతో.. ప్రజల తిప్పలు!

image

HYD ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, పాతబస్తీ, కోఠి తదితర ప్రాంతాల్లో కలుషిత తాగు నీరు సరఫరా కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలియాబాద్ సెక్షన్ పరిధిలోనూ పలుచోట్ల నుంచి ఈ సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. మంచినీటిలో మురుగు నీరు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో అధికారిక యంత్రాంగం మంచినీటి పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.

News September 5, 2024

వరద బాధితులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: DBP అధ్యక్షుడు

image

తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన అదుకోవాలని దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరదల్లో మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు.

News September 5, 2024

HYD: ‘వరదలకు దెబ్బతిన్న కల్వర్టుల వివరాలను నమోదు చేయాలి’

image

వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల వివరాలను నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెగిన కాలువలు, కుంటలు, చెరువు కట్టలు, కల్వర్ట్‌లపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.

News September 5, 2024

HYD: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYD, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT