India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలోని పలు ప్రాంతాల్లో GHMC కమిషనర్ ఆమ్రపాలి శానిటేషన్‌పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, మూసాపేట్, భరత్ నగర్‌లోని రైతుబజార్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. GVP తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
కాళేశ్వరం పేరిట మాజీ సీఎం KCR, మాజీ మంత్రి KTR తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. KCR కుటుంబ పాలనలో అనేక స్కాములు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని NDA ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మీ కామెంట్?
ఒక నటుడిని సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో నివసించే నటుడు ఎస్.రామచైతన్య(33)కు గత నెల 12న హైకోర్టు నుంచి అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీపై ఒక కేసు నమోదైందని స్కైప్ ద్వారా సైబర్ పోలీస్ కమిషనర్ అంటూ కాల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేయగా.. రూ.1.50 లక్షలు పంపించాడు. తర్వాత మోసమని గ్రహించి జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైంది.
ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. HYD బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఉదయ్ నగర్‌లో నివసించే పీ.అనురాధ(21) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నెల రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యుడు మాత్రలు ఇచ్చి సీటీ స్కాన్ తీసుకునిరావాలని సూచించాడు. అదే రోజు రాత్రి తన గదిలోకి వెళ్లిన యువతి ఉరేసుకుంది. గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
GHMC నుంచి ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్) డైరెక్టరేట్ వేరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు సంబంధిత డైరెక్టర్ పరిధిలో ఉన్న రవాణా, ప్రకటనల విభాగాలను GHMC కమిషనర్ ఆమ్రపాలి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పారిశుద్ధ్యం, రవాణా విభాగాల అదనపు కమిషనర్‌గా సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్‌ను, ప్రకటనల విభాగాన్ని అదనపు కమిషనర్ సత్యనారాయణకు కేటాయించారు.
రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉపాధి శాఖ కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్తంగా ఈనెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. HYD ఎర్రగడ్డ రైతుబజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు. దాదాపు 17 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఫోన్: 9494092219
సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు, ఉద్యోగులకు సబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ పరిశీలించారు.
HYD నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్‌లకు అటాచ్ చేస్తూ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.