RangaReddy

News July 4, 2024

HYD: గురుకులాల్లో కామన్ టైమ్ టేబుల్: సీఎస్

image

రాష్ట్రంలోని ఐదు గురుకుల విద్యా సంస్థల్లో కామన్ టైమ్ టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా బోధన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలో అయితే డేస్కాలర్ స్కూల్ తరహాలో టైమ్ టేబుల్ అమలు చేస్తున్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే విధానం అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి బుధవారం HYDలో ఉత్తర్వులు జారీ చేశారు.

News July 4, 2024

నేడు GHMC స్థాయీ సంఘం సమావేశం

image

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన నేడు స్థాయీ సంఘం సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 11 అంశాలకు సంబంధించి.. అన్ని పార్టీల సభ్యులు చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపనున్నారు. GHMCలోని వివిధ శాఖల అధికారులు, సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు.

News July 4, 2024

HYD: రంగంలోకి డీఆర్ఎఫ్ బృందాలు

image

వర్షాల నేపథ్యంలో రోడ్లపై భారీగా నిలిచే నీళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా జలమండలి డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 238 స్టాటిక్, 154 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వర్షపు నీటి తొలగింపులో నిమగ్నమయ్యాయి. రాత్రి నగరంలో పలుచోట్ల కురిసిన వర్షానికి నీరు నిలిచిన ప్రాంతాల్లో ఈ బృందాలు నీటిని తొలగించాయి.

News July 4, 2024

HYD: స్టెరాయిడ్స్‌తో ఆరోగ్య సమస్యలు!

image

HYD, ఉమ్మడి RRలో యువత ఆసక్తిని కొన్ని జిమ్ సెంటర్లు ఆసరాగా చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరగా సిక్స్ ప్యాక్స్ రావాలన్నా, లావు తగ్గాలన్నా, ఎక్కువ సేపు జిమ్ చేయాలన్నా నిషేధిత స్టెరాయిడ్స్‌ వాడాలని కొందరు కోచ్‌లు చెప్పడం గమనార్హం. ఇటీవల మెహదీపట్నంలో ఓ యువకుడు నిషేధిత ఇంజక్షన్ తీసుకుని కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు.పాతబస్తీలో ఈ ఇంజక్షన్లు, మాత్రలు అమ్మే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News July 4, 2024

HYD: RS ప్రవీణ్ కుమార్‌పై బల్మూరి వెంకట్ ఫైర్

image

BRS రాష్ట్ర నేత RS ప్రవీణ్ కుమార్‌పై MLC, NSUI స్టేట్ చీఫ్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. BRSఅధికారంలో ఉన్నప్పుడు వేకెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా RS ప్రవీణ్ కుమార్ GO నంబర్ 81లో మార్పులు ఎందుకు చేయలేదని బల్మూరి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. 2018లోనే GOలో మార్పులు చేసి ఉంటే సమస్య ఉండేది కాదని, అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వేకెన్సీ నిబంధనలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.

News July 4, 2024

HYD: ఖైరతాబాద్‌లో కల్కి 2898 AD మూవీ ట్రక్..!

image

HYD ఖైరతాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద కల్కి 2898 AD సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో భాగంగా మూవీలో ఉపయోగించిన భారీ ట్రక్‌ను ప్రదర్శించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసేందుకు వేలాదిగా ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు. జపాన్ నుంచి కొందరు ఫ్యాన్స్ వచ్చి ట్రక్కు ముందు నిలబడి ఫొటోలు దిగారు. రెబల్ స్టార్ ర్యాంపో అంటూ కేకలు వేశారు. జపాన్ నుంచి HYD వచ్చి సినిమా చూడడం సంతోషంగా ఉందన్నారు.

News July 4, 2024

భారీ ప్రాజెక్టులతో దీటైన నగరంగా HYD!

image

HYD నగరాన్ని ప్రపంచంలోనే దీటైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓవైపు RRR(రీజినల్ రింగ్ రోడ్), మరోవైపు మూసి రివర్ డెవలప్‌మెంట్, ఇంకోవైపు శంషాబాద్ పరిసరాల్లో 1000 ఎకరాల్లో ఫార్మసిటీ హబ్, వీటన్నింటికి తోడు HYD ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా మార్చే ప్రాజెక్టులతో HYD నగర రూపురేఖలే మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

News July 4, 2024

HYD: గాంధీలో డబ్బులు డిమాండ్ చేస్తే కాల్ చేయండి!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని డాక్టర్లు తెలియజేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 9392249569‌కు కాల్ చేయాలని అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో అన్ని విధాల వైద్య సేవలు గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
SHARE IT

News July 4, 2024

HYD: ఇక నుంచి ఫ్రీ క్యాబ్ క్యాన్సిలేషన్!

image

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓలా, ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే వారికి అధికారులు శుభవార్త చెప్పారు. ఇక నుంచి క్యాబ్ క్యాన్సిలేషన్ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం అని వెల్లడించారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. SHARE IT

News July 3, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓బోయిన్‌పల్లి: బ్రీత్ అనలైజర్‌తో మందుబాబు పరారీ.. చివరికి అరెస్ట్
✓GHMC పరిధిలో కమిషనర్ ఆమ్రపాలి తనిఖీలు
✓చేవెళ్ల: MLA యాదయ్య చేరికకు వ్యతిరేకంగా నినాదాలు
✓హబీబ్‌నగర్: నగరంలో తక్కువ ధరకే మాంసం అంటూ మోసం
✓జులై 8 నుంచి 10 వరకు బల్కంపేట బోనాలు
✓అన్ని జిల్లాల్లో బోనాల పండుగ చెక్కుల పంపిణీకి సిద్ధం