India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలిక (14)పై డేవిడ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. మరోసారి అత్యాచారం చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రేప్, పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పంజాగుట్ట NIMS ఆసుపత్రి పరిసరాలలో పారిశుద్ధ్యం లోపించింది. ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం వచ్చే ప్రజలు అనారోగ్యాల పాలయ్యేలా ఉంది. మిలీనియం బ్లాక్ వెనకాల డ్రైనేజీ, గార్బేజి కంపు కొడుతుంది. దోమల బెడద సైతం అధికంగా ఉంటుందని రోగులు వాపోతున్నారు. మరోవైపు ఆసుపత్రి లైబ్రరీ మొత్తం ఇనుప సామగ్రితో నిండిపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని పేషెంట్లు, సహాయకులు కోరుతున్నారు.
డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో సహకరించకుండా బ్రీత్ అనలైజర్ లాక్కొని పరారీ అయిన వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో జూన్ 27న తనిఖీలు నిర్వహించారు. కారులో వస్తున్న శ్రవణ్ కుమార్‌ను ఆపి టెస్ట్ చేయబోయారు. ఒక్కసారిగా బ్రీత్ అనలైజర్‌ను లాక్కున్న అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.
GHMC కమిషనర్ ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణగూడలో శానిటేషన్ పనులపై ఆరా తీశారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ZCని ఆదేశించారు. శంకర్‌మఠ్ వద్ద రాంకీ RFC వెహికిల్ డ్రైవర్‌తోనూ ఆమె మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్థినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. SHARE IT
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి టీజీపీఎస్సీని 20 లక్షల మందితో త్వరలో ముట్టడిద్దామని నిరుద్యోగ ఐకాస నాయకుడు మోతీలాల్ నాయక్ పిలుపునిచ్చారు. మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం దిగిరాదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అనంతరం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని వాపోయారు.
ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో ఆలయాలకు ఇవ్వాల్సిన చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో వాటిని పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 7న జగదాంబ మహంకాళి గోల్కొండ, లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు.
మనీ లాండరింగ్, డ్రగ్స్ వచ్చాయని కాల్స్ రాగానే కంగారు పడొద్దని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టెలీకాలర్స్ డీఎస్సీ కేవీఎం.ప్రసాద్ సూచించారు. వీడియో కాల్‌లో అటు వైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే అని, ముఖం కనిపించకుండా పోలీసు, సీబీఐ అధికారిగా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలన్నారు. మోసపోయినట్టు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్ అవర్) పోలీసులకు/1930 నంబర్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16.45 లక్షల టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘ట్రేడింగ్’ గురించి ప్రకటన కంట పడింది. ముందుగా ట్రేడింగ్ గురించి అవగాహన కల్పించారు. నిజమేనని నమ్మిన బాధితుడు రూ.16.45 లక్షలు పెట్టుబడి పెట్టేశాడు. ఆ తర్వాత అవతల వ్యక్తుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నీట్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AISF నాయకులు ఆరోపించారు. AISF హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 4న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. నాయకులు వంశీ, అరుణ్, వెంకటేశ్, ఉపేందర్, బన్నీ, భాను, వరుణ్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.