India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిల్లలను ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడనీయొద్దని, దానికి అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోయిన ఘటనలు తాజాగా HYDలో వెలుగు చూశాయి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఈశ్వర్(14), తార్నాక లాలాపేట్‌లో సాయివాసవి(13), నల్లకుంటలో మరో బాలిక(14) ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
VKB జిల్లాలో రూ.100 కోట్లతో అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రత్యేక జిల్లా సమావేశం నిర్వహించి, రూ.100 కోట్ల ప్రాజెక్టు పురోగతి పనులపై పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వికారాబాద్ జిల్లా తెలంగాణ టూరిజం హబ్‌గా అవతరిస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాలు.. దొమ్మరపోచంపల్లికి చెందిన ముజాహిద్ ఆలియాస్ ముజ్జు(50), నవాబ్ కుంటకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్(40) స్నేహితులు. ఇద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా గొడవలు అయ్యాయి. సయ్యద్ ఇస్మాయిల్‌ను ముజాహిద్ తన స్నేహితులు పాషా(25), ఫిరోజ్ ఖాన్(31)తో కలిసి హత్య చేశారు. నేరం రుజువు కాగా శిక్ష పడింది.
రాజేంద్రనగర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి రూ.790 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి, విత్తనాలు ఫర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ లా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ప్రారంభించారు. రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు, తమ భూముల సారవంతం తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు, రైతులు వాడే విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
HYD, ఉమ్మడి RRలోని పలు ప్రాంతాలకు బస్సులు సరిపడా లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడపాలని కోరుతున్నారు. ఐటీ కారిడార్, దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్ ప్రాంతాలకు ఒకే బస్సు ఉంది. దీంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సు రాగానే దాని వెంట పరుగులు తీసి మరి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీ ప్రాంతాల్లో ఉందా కామెంట్ చేయండి.
RR జిల్లా వెస్ట్ రీజియన్ 17 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు జులై 3న చిలుకూరులోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో ఉదయం 9 గంటలకు డెమో ఇంటర్వ్యూ తరగతులు జరగనున్నాయి. పీజీ, బీఈడీ, BNM, BPED,BLIC చేసినవారు అర్హులు కాగా..తెలుగు,హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, పౌర, సాంఘిక,జంతు,వృక్ష, ఆర్థిక, రసాయన శాస్త్రాల్లో పోస్టులు ఉన్నాయన్నారు.
HYD, ఉమ్మడి RRలో వివిధ కారణాలతో ఒక్క రోజు వ్యవధిలో 15 మంది సూసైడ్ చేసుకున్నారు. శంషాబాద్‌లో విష్ణు, జవహర్‌నగర్‌లో శ్రావణి, జగద్గిరిగుట్టలో సయ్యద్ దిలావర్, నాగోల్‌లో రాకేశ్ మాలిక్, అబిడ్స్‌లో ఇందూరాణి, శేఖర్, డబీర్‌పురలో యూనుస్, బాలాపూర్‌లో ముషారఫ్, ఫిలింనగర్‌లో నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌లో నర్సింగ్, బొల్లారంలో అఖిల్, వికారాబాద్ జిల్లాలో శివానంద్, చందన, రాములమ్మ, వెంకటేశ్ చనిపోయారు.
HYD తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ కమిషన్ కార్యాలయంలో గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరిగింది. HYD, RR, MDCL, VKB సహా ఇతర జిల్లాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంత మంది అభ్యర్థులు పూర్తి దరఖాస్తులు తీసుకురాకపోవడంతో, అధికారులు పలు సూచనలు చేసి, వారికి తగిన సమయం కేటాయించారు.
ట్రేడింగ్‌లో లాభాలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యాపార వేత్తకు ఎక్స్.టీబీ ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట సందేశం వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేయగా.. ఎక్స్.టీబీ ఫారెక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. మొదట అతడికి ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని నమ్మించి రూ.8.90 లక్షలు కొట్టేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లాల్‌బంగ్లా, అమీర్‌పేట్, సికింద్రాబాద్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేశారు. ఈ మేరకు 3 ఆటోలను సీజ్ చేశామని, 5 పాఠశాలల బస్సులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.