India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చక్రిపురం వైజంక్షన్, ఎన్ఎఫ్ కూడలి, కుషాయిగూడ ఠాణా సమీపంలోని రమాదేవి ఆస్పత్రి కూడలి, ఏఎస్ రావునగర్, అశోక్ నగర్, కెనరా బ్యాంకు కూడలి, నేతాజీనగర్, హెబ్‌బీ కాలనీ ఎక్స్ రోడ్డు, తల్లూరి కూడలి, కుషాయిగూడ డీమార్ట్ కూడలి, శారద చౌరస్తా, ఉప్పల్ ఎక్స్ రోడ్డు, చిలుకానగర్, వీటీ కమాన్ తదితర కూడళ్లు ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్‌నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా HYD కమిషనరేట్ పరిధిలో హబ్సిగూడ, నల్గొండ ఎక్స్‌రోడ్డు, మిథాని, మదీనా, చాదర్‌ఘాట్ రోటరీ, నానల్‌నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి నోబుల్ టాకీస్, రేతిబౌలి, టప్పాచబుత్రా, పురానాపూల్, చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 36, బంజారాహిల్స్ రోడ్డు నంబర్లు 1,2, మహారాజ అగ్రసేన్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.
HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు చౌరస్తాల్లో నిత్యం ఫుల్ ట్రాఫిక్ ఉంటోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన కూడళ్లను విస్తరించాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే 3 కమిషనరేట్ల పోలీసులు GHMCకి చౌరస్తాల జాబితాను అందించారు. రాచకొండలో 44, HYDలో 48, సైబరాబాద్‌లో 35 చౌరస్తాలు ఉన్నాయి. మొత్తం 127 కూడళ్లను విస్తరించనున్నారు.
HYD రవీంద్రభారతిలో ఆదివారం మైత్రి నాట్యాలయ స్కూల్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు శిరిణికాంత్ శిష్యురాలైన వైష్ణవి కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా జావళి, తిల్లాన, శ్రీఘననాథం, ఓంకార, తరంగం తదితర అంశాల్లో నర్తించి ఆహుతులను మైమరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ హాజరై వైష్ణవిని సత్కరించి అభినందించారు.
ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాగోల్ చౌరస్తాలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారుని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి సురేష్ తన కారులోని సీఎన్జీ గ్యాస్ కిట్‌లో గంజాయి అమర్చుకొని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌తో పాటు.. పలు పీఎస్‌లలో సురేష్‌పై గంజాయి పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.
HYD నగరంలో బాలికపై జరిగిన అత్యాచారం కలకలం రేపుతోంది. ఓ బాలికకు కూల్ డ్రింకులో గంజాయి కలిపి తాగించి, కిడ్నాప్ చేసిన ఘటన కాచిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నరేష్, విజయ్‌తో పాటు.. దాదాపు 8 మందిని అరెస్టు చేశారు.
✏జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✏T20WC ఛాంపియన్‌గా ఇండియా.. జిల్లాలో సంబరాలు
✏VKBD: రేపు ప్రజావాణి
✏జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✏గండీడ్, మహమ్మదాబాద్: ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగించండి
✏వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
✏పరిగి: రోజురోజుకు పెరుగుతున్న చోరీలు.. ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు
✏మహమ్మదాబాద్: నూతన జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
HYDలోని రాజ్ భవన్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లైఫ్ జర్నీపై ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్ భవన్ వద్ద ఈ కార్యక్రమం జరగగా.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మనస్తాపంతో ఉరేసుకొని 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై డి.సుబాష్ వివరాల ప్రకారం.. లింగంపల్లిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేశ్ కూతురు రుకిత(12) ఏడో తరగతి చదువుతోంది. కామారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తీసుకువెళ్తామని చెప్పి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపానికి గురైన రుకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.