RangaReddy

News June 30, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు అధికారులపై కేసు

image

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదయింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, చక్రపాణిపై సీబీఐ కేసు నమోదుచేసింది. వీరి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాగా, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

News June 30, 2024

HYD: రూ.10 కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి..!

image

HYD నగరంలో రూ.10 కోసం జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అన్వర్ (37) ఆటోలో.. ఓ బాలుడు (16) ప్రయాణించాడు. ఆటోడ్రైవర్ ఛార్జీ రూ.20 అడగగా, బాలుడు రూ.10 మాత్రమే ఇచ్చాడు. మిగతా పైసలు ఇవ్వడానికి నిరాకరించిన బాలుడు డ్రైవర్‌ను నెట్టేశాడు. కిందపడిన డ్రైవర్ తలకు గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 30, 2024

హైదరాబాద్: టీమిండియాకు అభినందనలు తెలిపిన KTR

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. T20 ప్రపంచ కప్‌ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ గొప్పగా అనిపించింది అన్నారు. బౌలర్స్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టారు మరియు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ చేసి వందల కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టారని X లో రాసుకొచ్చారు.

News June 30, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌ను ఎత్తుకెళ్లిన వాహనదారుడు

image

తనిఖీలు చేపడుతున్న పోలీసుల వద్ద నుంచి ఓ వాహనదారుడు బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. బోయిన్పల్లి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పట్టుకుని వేగంగా పారిపోయాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడి ఆచూకీ కోసం, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

News June 30, 2024

KPHB: రెండు వారాలకు మించి దగ్గు వస్తుందా?

image

KPHB పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారుల బృందం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. డాక్టర్ సంధ్య మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు వస్తే వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీబీ టెస్ట్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 30, 2024

వైస్ ఛాన్సలర్ పోస్టుల్లో 50% బీసీలను నియమించాలి: ఆర్. కృష్ణయ్య

image

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకాల్లో బీసీలకు 50శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్ టియూ, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టును బీసీలకు కేటాయించాలన్నారు.

News June 29, 2024

వికారాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

✏జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✏VKBD:213 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి: స్పీకర్
✏నాటు సారా విక్రయించిన, సరఫరా చేసిన కేసులు నమోదు:తాండూర్ ఎక్సైజ్ సీఐ
✏మల్లికార్జున్ ఖర్గేను కలిసిన తాండూర్ ఎమ్మెల్యే
✏మద్దూర్: చిరుత దాడితో లేగ దూడ మృతి
✏దోమ:కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే
✏VKBD:DS మృతి.. జిల్లా నేతల సంతాపం
✏జిల్లాలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

News June 29, 2024

213 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి: స్పీకర్

image

పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనులపై అటవీ దేవాదాయ మిషన్ భగీరథ భూగర్భ జలాల మున్సిపల్ విభాగాల అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ.110 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

News June 29, 2024

డి.శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: డిప్యూటీ సీఎం

image

ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

News June 29, 2024

HYD: ORR చేసింది కాంగ్రెస్.. RRR చేసేది కాంగ్రెస్!

image

HYD మహానగరాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు నాడు ఔటర్ రింగ్ రోడ్డు(ORR) అయినా.. నేడు రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అయినా చేసింది కాంగ్రెస్, చేసేది కాంగ్రెస్.. అని తెలంగాణ కాంగ్రెస్ X వేదికగా మ్యాప్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. RRR పనులను సెప్టెంబర్ నాటికి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని ఇటీవల రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.