India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD పరిధిలో గత 22 రోజుల్లోనే 1108 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కువగా మద్యం సేవించి ప్రమాదాలకు కారకులైన వారు ఉన్నారని తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేశామన్నారు. కొందరి దగ్గర నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, ధ్రువపత్రాలు, హెల్మెట్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వెళ్లడం లాంటి కేసులు కూడా ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.
HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో అతడి గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించడం చాలా బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈరోజు HYD బంజారాహిల్స్‌లోని ఎంపీ అరవింద్ నివాసంలోని డీఎస్ పార్థివదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ పార్థివదేహానికి ఈరోజు HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ గొప్ప నాయకుడని కొనియాడారు. ఎంతో ప్రజా సేవ చేశారని తెలిపారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లో ఉంటున్న ప్రజలకు అందులోనూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్, మెయిల్స్ వస్తున్నట్లుగా HYD తపాలా కార్యాలయ అధికారులు తెలియజేశారు. మీ పార్సల్ వేర్ హౌస్ వద్దకు వచ్చిందని, మీ కరెక్ట్ అడ్రస్ పంపాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని సూచించారు. నకిలీ లింకులపై క్లిక్ చేయొద్దని, సమస్యలపై sancharsaathi.gov.in/sfcలో ఫిర్యాదు చేయాలన్నారు.
HYD అంబర్‌పేట్‌లో నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఫెడెక్స్ కొరియర్ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘నీ ఆధార్ నంబర్‌తో ముంబై నుంచి ఇరాన్‌కు మాదకద్రవ్యాలతో పార్సిల్ వచ్చింది.. దీనిపై కేసు నమోదైంది’ అని బెదిరించాడు. కేసు నకిలీ పత్రాలను చూపించాడు. బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలనడంతో రూ.18 లక్షలు ఇచ్చాడు. వెంటనే బాధితుడు తేరుకుని పోలీసులకు కాల్ చేయగా 8 నిమిషాల్లోనే నగదు బదిలీని ఆపేశారు.
ఏటీంఎలో డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా ఆలస్యం అవడం.. డబ్బు నిల్వ లేదనుకుని ఖాతాదారు వెళ్లి పోయిన తర్వాత నగదు ప్రత్యక్షమైన ఘటన HYD పాతబస్తీ హాషామాబాద్‌లో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డులోని హాషామాబాద్ టవర్‌గల్లీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.20 వేలు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డబ్బును ఏఎస్సై తీసుకొని బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వగా కస్టమర్‌కు ఇస్తామన్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించేలా కసరత్తు చేయాలని, సెప్టెంబర్‌లో ఈ మేరకు పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారులపై హైటెక్ సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆయన మాట్లాడారు. ఇప్పటికే HYD-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో జాప్యం చోటుచేసుకుందన్నారు.
BRS మహిళా నేత, మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహేశ్వరం ప్రాంతానికి రద్దు చేసిన రూ.250 కోట్లను తిరిగి మంజూరు చేయాలన్నారు. గత సర్కారు మంజూరు చేసిన పనులను రద్దు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.