India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమకు అడ్డొస్తున్నాడని ఫ్రెండ్‌ను దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD కూకట్‌పల్లి అల్లాపూర్‌లోని సఫ్దర్‌నగర్ వాసి డానీష్(17) యూసుఫ్‌గూడలో ఇంటర్ చదువుతున్నాడు. తనతోపాటు చదివే ఓ అమ్మాయితో డానీష్ చనువుగా ఉన్నాడు. ఆ అమ్మాయినే ప్రేమిస్తున్న ఓ రౌడీ షీటర్ కుమారుడు కోపంతో బోరబండలో తన ఫ్రెండ్స్‌తో కలిసి డానీష్‌ను బీరు సీసాలతో కొట్టి చంపేశాడు. 10 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ అధికారుల పాత్ర కీలకమైందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో HYD పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగిన సంఘ రాష్ట్రస్థాయి సదస్సులో కోదండరాం ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ అధికారుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
HYD శంషాబాద్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం బీదర్ వాసి ప్రియాంక(26).. కుమారుడు అద్విక్(3), కుమార్తె ఆరాధ్య(7 నెలలు)తో కలిసి శంషాబాద్ RB నగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పిల్లలకు విషమిచ్చి ప్రియాంక ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు వచ్చి పిల్లలను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్‌లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి బూర్గులలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో బ్లాస్ట్ జరిగి ఆరుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా ఒక్కసారిగా కంప్రెషర్ గ్యాస్ పేలడంతో కార్మికులు ఎగిరిపడ్డారు. మృతదేహాలు, మాంసపు ముద్దలు, కార్మికుల అవయవాలు, కాళ్లు, చేతులు పరిశ్రమలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి పరిస్థితిని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. శంషాబాద్ DCP రాజేశ్ పరిశీలించారు.
HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేకాధికారిణి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మొహర్రం పవిత్ర మాసంలో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.
పోక్సో కేసులో ఓ ఆర్మీ రిటైర్డ్ జవాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శ్రీధరన్ 2017లో సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితుడు శ్రీధరన్‌కు ఈరోజు న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించారు.
చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లోని బిర్యానీ తిని వెళ్లిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బాలాపూర్‌లోని నాబెల్ కాలనీలో నివాసం ఉండే ఓ నర్సు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలోని నగదు, బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఫ్రిజ్‌లో ఉన్న బిర్యానీని కిచెన్‌లో వేడి చేసుకుని తిన్నారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.