India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులను అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.అలివేలు మంగా ఈరోజు తెలిపారు. ఎకనామిక్స్, హిస్టరీ, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు జులై 1వ తేదీ సా.5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి ఆయన శుక్రవారం HYD సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వినతి పత్రం అందజేశారు. జాబ్స్ కోసం లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
HYD శామీర్‌పేట్ మండలం హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్కూల్ ప్రాంగణంలోని నీటి గుంతలో పడి కాన అనే రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు కాగా వారు HYD వలస వచ్చి హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ నర్సరీలో పని చేస్తున్నారు. జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.
HYD శివారులో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్‌లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే పటాన్‌చెరు పరిధి ముత్తంగిలో 7 నెలల చిన్నారిని కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి మృతదేహంతో పాటు గాయపడిన 7 నెలల చిన్నారిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాచకొండ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 160 వాహనాలు తమ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీధుల్లో వదిలేసిన బైక్‌లను అంబర్‌పేటలోని హెడ్ క్వార్టర్స్‌లో భద్రపరిచారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూయించి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే రూల్స్ ప్రకారం వేలం వేస్తామని స్పష్టం చేశారు. SHARE IT
మహానగరంలో వాయుకాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా మరింత పచ్చదనం పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. HMDA పరిధిలో కొత్తగా మరో 29 ఉద్యానాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రూ. 46 కోట్లు వెచ్చించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ 12.9% పచ్చదనంతో ఉంది. దీనిని 33 శాతానికి పెంచాలని HMDA లక్ష్యంగా పెట్టుకొంది.
హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్ రూ. 132, విత్ స్కిన్ కిలో రూ. 191, స్కిన్‌లెస్ రూ. 218 నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు. ధరలు తగ్గడంతో మాంసం విక్రయాలు పెరిగే అవకాశం ఉందని HYD పార్శిగుట్టలోని ఓ వ్యాపారి తెలిపాడు. బోనాల సీజన్ కావడంతో ఈ ఆదివారం నుంచే గిరాకీ ఉంటుందన్నారు.
ఉప్పల్‌లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్ పరిధి శ్రీనివాసపురం వాసి దినేశ్ కుమార్(36) మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. విధులు ముగించుకొని గురువారం యాక్టివాపై ఇంటికి బయల్దేరాడు. Genpact వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.
వానాకాలం దృష్ట్యా ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రోజువారీగా 10 వేల కాల్స్‌ను సిబ్బంది స్వీకరిస్తుంటారని.. గాలివానతో అంతరాయాలు తలెత్తితే ఇది 95 వేల వరకు వెళ్తుందని తెలిపారు. విద్యుత్తు అంతరాయాలు తలెత్తినప్పుడు 1912కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి ఈ కేంద్రం పనిచేస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నిల్వ నీటితో రోడ్లు చెరువులు అవుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇలా నీటి నిల్వల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఏటా వర్షాకాలంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తుంది.ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల్లో మాన్‌సూన్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.