RangaReddy

News June 27, 2024

HYD: న్యాయవాదుల సహకార సంఘం నూతన డైరెక్టర్ల ఎన్నికలు

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు జంట నగరాల్లోని అన్ని కోర్టుల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘం నూతన డైరెక్టర్ల ఎన్నికలు జులై 21న జరగనున్నాయి. ఈనెల 28 నుంచి జులై 4 వరకు నామపత్రాల స్వీకరణ, 6న పరిశీలన, 9న ఉపసంహరణ, 11న పోటీలో మిగిలిన తుది అభ్యర్థుల జాబితా విడుదల, 21న (ఆదివారం) పోలింగ్ ఉంటుంది. 

News June 27, 2024

HYD: ఎదుగుతున్నాడని ఓర్వ లేక చంపేశాడు..!

image

HYD అల్వాల్ పరిధి కానాజిగూడ ఇందిరానగర్‌లో ఇటీవల హత్యకు గురైన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్(45) కేసును పోలీసులు ఛేదించారు. ACPరాములు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్ వాసి అన్వర్, ఉత్తరాఖండ్ వాసి మనోజ్(33) కుటుంబాలతో కలిసి HYD వలస వచ్చారు. అయితే తన కళ్ల ముందే అన్వర్ ధనవంతుడు కావడం చూసిన మనోజ్ ఓర్వలేకపోయాడు. ఇటీవల అన్వర్‌కు మద్యం తాగించి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. పోలీసులు మనోజ్‌ను అరెస్ట్ చేశారు.

News June 27, 2024

HYD: EVDM కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ

image

GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు HYD బుద్ధభవన్‌లోని కమిషనర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఉద్యోగ బాధ్యతలను కూడా ఎప్పటిలాగానే విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

News June 27, 2024

HYD: జలమండలి నూతన ఎండీగా అశోక్ రెడ్డి

image

జలమండలి నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుత ఎండీగా విధులు నిర్వహించిన సుదర్శన్ రెడ్డి వద్ద నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశోక్ రెడ్డికి ఇప్పటికీ జలమండలితో మంచి అనుబంధం ఉంది.

News June 27, 2024

HYD: ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా .. ఇది మీ కోసమే..!

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. బుధవారం HYD నల్లకుంటలో ఆమె మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జులై 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.SHARE IT

News June 27, 2024

HYD: పెరుగుతున్న డెంగ్యూ వ్యాధి కేసులు.. జర జాగ్రత్త..!

image

వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులపై HYD, RR, MDCL, VKB జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులతో పాటు పీహెచ్‌సీలు, ప్రైవేట్ దవాఖానాలకు రోగులు పోటెత్తుతున్నారు. గడిచిన 25 రోజుల్లో ఫీవర్ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధితో 15 మంది చేరారు. ఇక HYDలో మే నెలలో 39, జూన్ 25వ తేదీ వరకు 35 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు శుభ్రత పాటించాలన్నారు. SHARE IT

News June 27, 2024

గోల్కొండ బోనాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి

image

గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెలరోజులపాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గోల్కొండ కోటకు బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News June 27, 2024

HYD: రీల్స్ పిచ్చి.. లైక్స్ కోసం ఇలా చేస్తున్నారు..!

image

రీల్స్ పిచ్చి ప్రాణాలు తీస్తున్నా పలువురు యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదకరమైన స్టంట్స్ చేయొద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం కొంత మంది యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా HYDహుస్సేన్ సాగర్ తీరంలో ఓ యువకుడు తన కొత్త బైక్‌ను ఒడ్డు చివరన ప్రమాదకరంగా నిలిపి ఇలా రీల్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

News June 27, 2024

శిల్పారామాన్ని సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధుల బృందం

image

మాదాపూర్‌లోని శిల్పారామాన్ని విదేశీ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. జార్జియా, ఆర్మేనియా, ఇరాన్‌, బెలారస్‌, తుర్క్మెనిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, మంగోలియా, కజకిస్థాన్‌ దేశాలకు చెందిన 21 మంది ప్రముఖ మీడియా ప్రతినిధుల బృందం శిల్పారామాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

News June 27, 2024

గాంధీ ఆసుపత్రికి రూ.66 కోట్ల నిధులు

image

గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులు మంజూరు చేసిన CM రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి​ దామోదర రాజనర్సింహాకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. TGMSIDC ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్‌​ను రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.