India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సోమవారం కొండా మాట్లాడుతూ.. 31 శాతం దళితులే ఉన్న రాయ్‌బరేలి నియోజకర్గంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. దేశ రాజధాని ప్రజలంతా బీజేపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.
HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు.
బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి ఓ అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈనెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
తెలుగు హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో థర్డ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఉస్మానియా లాంగ్వేజ్ సర్టిఫికెట్ కోర్స్, ప్రీ డిగ్రీ కోర్స్, బీఏ లాంగ్వేజెస్, ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చన్నారు.
ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్‌లు ఇద్దరు ACBకి పట్టుబడ్డ ఘటన శంషాబాద్ మం. నానాజీపూర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. HYDకు చెందిన బర్కత్ అలికి ఉన్న 500 గజాల స్థలంలో కాంపౌండ్ వాల్‌తో పాటు, చిన్న రూమ్ వేసుకోవడానికి గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికను సంప్రదించగా.. రూ.65 వేలు లంచం అడిగింది. చివరిగా రూ.30 వేలు ఇవ్వాలంది. నగదు ఇస్తుండగా ACB అధికారులు పట్టుకున్నారు.
రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో సెకెండ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.
HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.