RangaReddy

News June 25, 2024

హైదరాబాద్‌లో భారీ ప్రక్షాళన

image

HYD డెవలప్‌మెంట్‌‌ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్‌లో ప్రక్షాళన‌ మొదలైంది. GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి, HMDA కమిషనర్‌గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్‌ రెడ్డి‌ని నియమించింది. నగరంలోని 6 జోన్లకు కొత్తగా నలుగురు జోనల్‌ కమిషనర్లు వచ్చారు. కూకట్‌పల్లి ZCగా అపూర్వ్ చౌహన్, ఖైరతాబాద్ ZCగా అనురాగ్, ఎల్బీనగర్ ZCగా హేమంత్ పాటిల్, శేరిలింగంపల్లి ZCగా ఉపేందర్ రెడ్డిని నియమించారు.

News June 25, 2024

హైదరాబాద్‌లో సరికొత్త ప్రయోగం

image

HYD వాసులకు గుడ్‌న్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్(NSS) వాలంటీర్ల‌ సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం వాలంటీర్ల మొదటి బ్యాచ్‌కు ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ వాలంటీర్లు‌ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో‌ సిగ్నళ్ల వద్ద‌ ఉంటారు. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ‌లో వీరు భాగమవుతారని అధికారులు వెల్లడించారు.

News June 25, 2024

రంగారెడ్డి: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన

image

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరుద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. డీఎస్సీ షెడ్యూల్ వెంటనే ప్రకటించి, 25వేల పోస్టులు కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ప్రిపరేషన్‌కి రెండు, మూడు నెలల సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగుల ప్రమోషన్స్ వల్ల ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

News June 24, 2024

HYD: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

image

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు కాపాడారు. పర్వత్ నగర్‌లో నివాసం ఉండే సాయికిరణ్(23) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న మాదాపూర్ పోలీసులు గమనించి సాయి కిరణ్‌ను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

News June 24, 2024

“ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేటి ముఖ్యాంశాలు”

image

RR:శంషాబాద్ లో చిరుత సంచారం.
√VKB:మర్పల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్.
√RR:జుడాల సమ్మె ప్రారంభం వైద్యులకు సెలవులు రద్దు.
√RR:ORR లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్ బాబు.
√ ఆమనగల్లులో ఉప ముఖ్యమంత్రికి ఘన సన్మానం.
√RR: కేంద్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రెండు లక్షల కేటాయించాలి:ఆర్. కృష్ణయ్య.
√RR: ఓయూలో గ్రూప్-1,2 పోస్టులు పెంచి, మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన

News June 24, 2024

HYD: ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

image

రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు – సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని 3జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు

News June 24, 2024

HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

image

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రాస్‌‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT

News June 24, 2024

హైదరాబాద్‌ శివారులో మాజీ MPTC హత్య

image

హైదరాబాద్ శివారు‌లో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్‌కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PS‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్‌ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

HYDలో డ్రైవింగ్.. సెల్‌ఫోన్ మోగితే ఎత్తకండి!

image

హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు‌ రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు‌ నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్‌ ఫ్రీ లెఫ్ట్‌ వద్ద‌ ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడి‌పేటప్పుడు సెల్‌ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. బహుశా అది యముని పిలుపు కావొచ్చు’ అంటూ‌ హెచ్చరించారు.‌ ఇటీవల సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.‌ ఫాలో ట్రాఫిక్ రూల్స్.

News June 23, 2024

HYD: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

image

ప్రేమిస్తున్నాను అంటూ ఇంటర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన యువకుడి పై నారాయణగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఖలీల్ నారాయణగూడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖలీల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.