India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా 292 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 80 కార్లు, రెండు హెవీ వెహికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఐటీ కారిడార్‌లో 182 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారన్నారు.
గ్రేటర్ HYD వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రాంగ్ రూట్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. SHARE IT
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మొత్తం 40పడకలతో ఏర్పాటు చేస్తున్న వార్డులను పురుషులు, మహిళలకు వేర్వేరుగా 20పడకలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వార్డుల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా సుందరంగా ముస్తాబు చేస్తున్నామని, త్వరగా వాటిని తీర్చిదిద్ది మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు.
గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన HYD చందానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చందానగర్ హుడాకాలనీ సాయిబాబా ఆలయం ఆనుకొని ఉన్న నిర్జన ప్రదేశంలో మహిళ(40) మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లుగా అనుమానించారు. మృతురాలి ఎడమ చేతిపై బాలయ్య అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. కేసు నమోదు చేశారు.
మాజీ ప్రియుడి వేధింపులకు తట్టుకోలేని ఓ గృహిణి HYD మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీర్‌పేట్ పరిధి రహమత్‌నగర్‌లో నివాసముంటున్న గృహిణిని ఆమె మాజీ ప్రియుడు ఆర్బాజ్ ఖాన్ కలవాలని, లేకపోతే గతంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన బాధితురాలు PSను ఆశ్రయించగా కేసు నమోదైంది.
చలానాల నుంచి తప్పించుకునేందుకు పలువురు వాహనాల నంబర్ ప్లేట్ తారుమారు చేయటం, కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ HYDలో నంబరు ప్లేటు లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న 85 వాహనాల్లో 35 మంది యజమానులపై కేసు నమోదు చేశారు. 40 మంది మైనర్లను పట్టుకున్నారు.180/177 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్, చందానగర్ PSల పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తాజాగా లేఖను విడుదల చేశారు. రోడ్లపై ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మియాపూర్‌లోని సర్వే నంబర్ 100,101 వద్ద 3 రోజులుగా నెలకొన్న ఆందోళనల్లో భాగంగా ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న ఏ.వెంకటయ్యను కీసర ఎస్‌హెచ్ఓగా, కీసర SHOగా విధులు నిర్వహిస్తున్న కే.సీతారామ్‌ను కందుకూరు ఠాణాకు, కందుకూరు SHOగా పనిచేస్తున్న మక్బూల్ జానీని సైబర్ క్రైం విభాగానికి, యాదాద్రి ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కే.నాగరాజును మీర్‌పేట్ PSకు బదిలీ చేస్తునట్లు తెలిపారు.
ఉద్యోగాల పేరుతో మోసాలు, ఇతర వంచనాలకు పాల్పడే నిందితులపై బాధితులు వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదులనూ స్వీకరించి కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. బాధితులు వ్యక్తిగతంగా వెళ్లి ఫిర్యాదు చేస్తే SHO నిరాకరిస్తున్నారని, పలువురు జర్నలిస్టులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. బైక్ రేసులపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లో కొద్ది రోజుల నుంచి వరుస హత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఏరియాల్లో హైదరాబాద్ పోలీసులు మోహరించారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి హైదరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీలో పటిష్ఠ బందోబస్తు చేపట్టాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు. రాజధానిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.