RangaReddy

News April 20, 2024

HYD: 9 మేకులు మింగిన ఖైదీ

image

చర్లపల్లి జైలు​ ఖైదీ మహ్మద్​ షేక్​ (32) ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డులో చేరాడు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ HOD ప్రొ.శ్రవణ్​ కుమార్​ ఆధ్వర్యంలో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా 9 మేకులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

News April 20, 2024

HYD: బట్టతలపై వెంట్రుకలు.. FAKE డాక్టర్ అరెస్ట్

image

HYDలో నకిలీ డాక్టర్‌ గుట్టు రట్టయ్యింది. బట్టతలపై జుట్టు రప్పిస్తానని నమ్మిస్తున్న అస్లాం‌ను సౌత్‌‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చర్మరోగాలు, హెయిర్‌ ట్రాన్స్‌ఫ్లాంట్‌‌కు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. బహదూర్‌పురా, గచ్చిబౌలిలో ఏకంగా క్లినిక్‌లు ఓపెన్ చేయడం గమనార్హం. బాధితులకు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో‌ పోలీసులను ఆశ్రయించారు. శనివారం రైడ్స్ చేసి అస్లాంను అరెస్ట్ చేశారు.

News April 20, 2024

HYD: కంటోన్మెంట్‌లో BRSకు BIG షాక్

image

కంటోన్మెంట్ నియోజకవర్గంలో BRS పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత నేత సాయన్న ప్రధాన అనుచరుడు ముప్పిడి మధుకర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకొన్నారు. ఇప్పటికే నియోజకవర్గ BRS ముఖ్య నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరడం‌తో అధికార పార్టీ మరింత బలంగా తయారైంది.

News April 20, 2024

HYD: కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవడం మరిచారా? ఇలా చేయండి!

image

RTC బస్సులో ఒక్కోసారి కండక్టర్ టికెట్ ఇచ్చిన తర్వాత వెనక రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి సంఘటన RR జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. రూ.500 నోటును కండక్టర్‌కు ఇవ్వగా రూ.60 టికెట్ ఇచ్చి, మిగితా రూ.440 బస్ దిగేటప్పుడు ఇస్తానని టికెట్ వెనుక రాశాడు. అయితే సదరు ప్రయాణికుడు మర్చిపోయి RTC ఉన్నతాధికారులను సంప్రదించగా.. రూ.440 ఫోన్ పే చేశారు. మీకు ఇలా జరిగితే 040-69440000 సంప్రదించండి.

News April 20, 2024

HYD: నగ్నంగా వీడియో కాల్.. రూ.30వేలు వసూలు

image

నగ్నంగా వీడియో కాల్ చేసి నగదు దోచుకున్న ఘటన కందుకూరు PSలో జరిగింది. పోలీసుల ప్రకారం.. కిరాణా షాపు యజమానికి ఈనెల 17న వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా యువతి నగ్నంగా మాట్లాడింది. 18న మరోసారి ఓ అజ్ఞాత వ్యక్తి నేను పోలీస్‌నని చెప్పి.. నగ్నంగా ఉన్న మహిళతో నువ్వు మాట్లాడిన వీడియో యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతో రూ.30వేల నగదు పంపాడు. తర్వాత మరి కొంతమంది బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు.

News April 20, 2024

HYD: పది రోజుల్లో పెళ్లి.. యువతి అదృశ్యం

image

మరో పది రోజుల్లో వివాహం ఉండగా ఓ యువతి అదృశ్యమైన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీరాములు ప్రకారం.. రసూల్‌పురాకు చెందిన విఠల్ సింగ్ కుమార్తె గంగాబాయి(25) మెడికోవర్ హాస్పటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. మే 1న గంగాబాయికి వివాహం నిశ్చయించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

News April 20, 2024

నగరంలో పలు చోట్ల వర్షం

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, కేబీహెచ్బీ, నారాయణగూడ, హిమాయత్నగర్, లంగర్‌హౌజ్, మెహదీపట్నం, గచ్చిబౌలీ, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. అకాల వర్షంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. కాగా, కొన్ని రోజులుగా ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాజా వాతావరణం ఉపశమనం కలిగిస్తోంది

News April 20, 2024

షకీల్ కొడుకు రాహిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. అధికారులు సస్పెండ్

image

బోధన్ మాజీ MLA షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో జరిగిన యాక్సిడెంట్ నివేదికపై ఉన్నతాధికారులు స్పందించారు. రూ.లక్షలు వసూలు చేసి షకీల్ కొడుకు బదులుగా మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు FIR నమోదు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పాత బంజారాహిల్స్ ACP సుదర్శన్, CI రాజ్ శేఖర్ రెడ్డి, SI చంద్ర శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.

News April 20, 2024

HYD: డిగ్రీ పరీక్షలో ఫెయిల్.. రివాల్యుయేషన్లో 90% పైగా మార్కులు!

image

HYD నగరంలోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో పది మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం తొలి సెమిస్టర్లో ఒక్కో సబ్జెక్టులో ఫెయిలయ్యారు. రీవాల్యుయేషన్లో వారే తొంభై శాతానికి పైగా మార్కులతో పాసయ్యారు. ఉస్మానియా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో కొందరు ఫస్టియర్ విద్యార్థుల అనుభవమిది. రెగ్యులర్ పరీక్షలో ఫెయిలై రీవాల్యుయేషన్లో పాసయ్యారంటే మూల్యాంకనంలోనే లోపాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News April 20, 2024

మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ బోణి కొట్టనుందా?

image

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టనుందా? ఇప్పటివరకు BRS పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ, 2014లో బీజేపీ+టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, 2019లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానంలో బీఆర్ఎస్ గెలవలేదు. 2024లో గెలుస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.